‘గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌’ అంటే ఒక్కప్పుడు సచిన్‌ టెండుల్కర్‌ పేరు మాత్రమే చెప్పేవారని.. నిజానికి ఇప్పుడు ఆ బిరుదు టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీకి ఇస్తే బాగుంటుందని చెబుతున్నారు బాలీవుడ్‌ హీరో సునీల్‌ శెట్టి. తన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన సునీల్ శెట్టి... ఆ కార్యక్రమంలో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి కూడా కొన్ని విషయాలు పంచుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘ధోనీ అనే వ్యక్తి క్రికెట్ రంగానికి ఎంతో చేశారు. ఆయన ఎప్పటికీ రిటైర్ కాకూడదని భావిస్తున్నాను. ధోని రిటైర్ అయినా.. కాకపోయినా 'గాడ్ ఆఫ్ క్రికెట్' అనే మాట ఆయనకు మాత్రమే చెల్లుతుంది. ఆ మాటకు ఆయన మాత్రమే అర్హులు. ధోని రిటైర్‌మెంట్ విషయం చర్చకు వచ్చినప్పుడల్లా నాకు చాలా బాధేస్తుంది. ఆయన భారత్ జట్టులో శాశ్వతంగా ఉండిపోతే బాగుంటుంది కదా.. అని కూడా అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే టీమిండియాలో ధోనికున్న తెలివితేటలు లేదా ముందుచూపు ఇంకే క్రికెటర్‌కీ లేవు. మంచి టాలెంటెడ్ ఆటగాళ్లకు కెప్టెన్ షిప్ కట్టబెట్టే విషయంలో ధోని చాలా ఆలోచిస్తారు. ఆయన అభిప్రాయాలు ఎప్పుడూ తప్పు కాలేదు .’ అని తెలిపారు సునీల్ శెట్టి‌. 


క్రికెట్ అంటే ఎంతో మక్కువ కనబరిచే సినీ నటులలో సునీల్ శెట్టి కూడా ఒకరు. గతంలో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జరిగినప్పుడు.. ముంబయి హీరోస్ జట్టుకి సునీల్ శెట్టి సారథిగా కూడా వ్యవహరించారు. భల్వాన్ సినిమాతో బాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించిన సునీల్ శెట్టి  దిల్వాలే, మోహ్రా, గోపి కిషన్, బోర్డర్, ఆక్రోష్, హేరా ఫేరీ, ఖయామత్ లాంటి చిత్రాలలోని నటన ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్పోర్ట్స్ అంటే ఎంతో ఇష్టపడే సునీల్ శెట్టి కిక్ బాక్సింగ్‌లో బ్లాక్ బెల్ట్ హోల్డర్ కూడా కావడం గమనార్హం.