India vs Afghanistan T20: టీ20 వరల్డ్ కప్​లో భారత్ పేలవ ప్రదర్శన చేస్తోంది. తొలుత పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో ఘోరంగా విఫలమైన టీమ్ ఇండియా.. న్యూజిలాండ్​తో గత ఆదివారం జరిగిన మ్యాచ్​లోను ఆకట్టుకోలేకపోయింది. దీనితో టీమ్ ఇండియా సెమీస్​ చేరడం అత్యంత క్లిష్టంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పరిస్థితుల్లో నేడు (బుధవారం) అఫ్గానిస్థాన్​తో టీమ్ ఇండియా (India vs Afgan) తలపడనుంది. ఈ మ్యాచ్​లో ఓడిపోతే.. టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ బరి నుంచి తప్పుకున్నట్లే.


అశ్విన్​ను ఆడించాలి..


అయితే నేడు టీమ్ ఇండియాకు అత్యంత కీలకమైన మ్యాచ్ అయిన నేపథ్యంలో మాజీ క్రికెటర్ సునీల్​ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు మ్యాచ్​లో ఆడే ప్లేయర్స్​ ఎంపికకు సంబంధించి పలు సూచనలు చేశారు.


ముగ్గురు స్పిన్నర్లతో టీమ్ బరిలో దిగటంలో తప్పులేదని అన్నారు. అయితే అందులో రవిచంద్రన్‌ అశ్విన్ తప్పకుండా ఉండాలని పేర్కొన్నారు. అశ్విన్​ ప్రపంచ స్థాయి బౌలర్​ అని.. తప్పకుండా అతన్ని తుది జట్టులో ఉంచాలని స్పష్టం చేశారు. హార్దిక్‌ పాండ్య రెండు ఓవర్లు వేసినా.. బుమ్రా, శార్దూల్‌/షమీ పేస్‌ బౌలింగ్‌ సరిపోతుందని తెలిపారు.


Also read: T20 World Cup 2021: విరాట్ కోహ్లీ, ఇండియా టీమ్ మేనేజ్మెంట్‌పై Sunil Gawaskar ఆగ్రహం


Also read: Trolls on Team India: పెట్రోల్ ధర కన్నా టీమిండియా స్కోర్ తక్కువ.. ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్


మిస్టరీ స్పిన్నర్‌ ఆకట్టుకోలేకపోయాడు..


ఒక వేళ ఇద్దరు స్పిన్నర్లే చాలనుకుంటే.. చక్రవర్తి స్థానంలో అశ్విన్‌ను తీసుకోవాలని గావస్కర్‌ సూచించారు. ఇప్పటపి వరకు జరిగిన మ్యాచుల్లో.. మిస్టరీ స్పిన్నర్‌గా పేరొందిన వరుణ్‌ చక్రవర్తి ఆకట్టుకోలేకపోయాడని గుర్తి చేశారు.


Also read: Team India Failure Record: పరాజయంలో టీమ్ ఇండియా 22 ఏళ్ల రికార్డు


Also read: Virat Kohli: పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌లలో ఓడిపోవడానికి విరాట్ చెప్పిన కారణాలివీ


అఫ్గాన్​తో అంత ఈజీ కాదు..


వరుస ఓటములతో.. సతమతవుతున్న టీమ్ ఇండియాకు నేడు పాకిస్థాన్​తో జరిగే మ్యాచ్​ అంత సులభమైంది కాదని తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే మూడు మ్యాచ్​లు ఆడిన అఫ్గానిస్థాన్ టీమ్.. రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. స్కాట్లాండ్​, నమీబియాపై భారీ విజయాలు సాధించింది అఫ్గాన్ టీమ్. ఈ టోర్నీలో ఇప్పిటేకే సెమీస్ బెర్త్​ కన్ఫార్మ్​ చేసుకున్న పాకిస్థాన్​ టీమ్​ను దాదాపు ఒడించినంత పని చేసింది.


అఫ్గాన్​ బౌలర్లయిన.. నబీ, రషీద్‌ ఖాన్‌, ముజీబ్‌ స్పిన్‌ను ఎదుర్కొని పరుగులు రాబడితేనే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇదే సమయంలో టీమ్ ఇండియా పరంగా చూస్తే.. ఇప్పటి వరకు రెండు మ్యాచ్​లు ఆడింది. రెండింట్లోనూ పరాజయం పాలైంది. మరి ఈ సారైనా టీమ్ ఇండియా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.


Also read: T20 World Cup 2021: నమీబియాపై ఘన విజయంతో సెమీస్‌కు చేరిన పాకిస్తాన్


Also read: Afghanistan Vs Namibia: సెమీస్ రేసులో నిలిచిన అఫ్గానిస్థాన్.. నమీబియాపై ఘన విజయం


ఇండియా అఫ్గాన్ మ్యాచ్​పై అంచనాలు..


ఇవాళ ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో మరోసారి రోహిత్ శర్మ(Rohit Sharma), కేఎల్ రాహుల్ ఓపెనింగ్ దిగే అవకాశాలున్నాయి. ఫిట్నెస్ సమస్యలున్న సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో వస్తాడా లేదా అనేది ఇంకా తెలియదు. పెద్దగా రాణించని హార్దిక్ పాండ్యాను పక్కనబెట్టే అవకాశాలున్నాయి. మిస్టరీ స్పిన్నర్‌గా ఉన్న వరుణ్ చక్రవర్తిని ఆడిస్తారా లేదా తప్పించి అశ్విన్‌ను తీసుకుంటారా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు.


ఇక టాస్ గెలిస్తే టీమ్ ఇండియా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలున్నాయి. లేదా తొలుత బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం భారీ లక్ష్యాన్ని నిర్దేశించాల్సి ఉంటుంది. ఏదైనా సరే టీమ్ ఇండియా సెమీస్ ఆశలు పూర్తిగా నీరుగారకుండా ఉండాలంటే ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌ను ఇండియా గెలవక తప్పని పరిస్థితి.


Also read: India’s batting coach: టీమ్​ ఇండియా బ్యాటింగ్ కోచ్ పదవికి విక్రమ్ రాథోడ్​ మరోసారి దరఖాస్తు


Also read: Shane Warne x Steve Smith: షేన్​వార్న్​పై ఆస్ట్రేలియా అభిమాలు ఆగ్రహం- స్టీవ్​ స్మిత్​ను విమర్శించాడని..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి