SRH VS KKR: ఐపీఎల్‌-2022 లీగ్ దశ రసవత్తరంగా సాగుతోంది. ప్లే ఆఫ్స్‌ వెళ్లే జట్లు ఏవన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు ఒక్క జట్టు మాత్రమే ప్లే ఆఫ్స్‌కు వెళ్లింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉన్న రెండు జట్లు ఇంటిబాట పట్టాయి. ఇక మిగిలిన జట్లన్నీ ప్లే ఆఫ్స్‌ కోసం తలపడుతున్నాయి. చివరి లీగ్ మ్యాచ్‌ వరకు నువ్వానేనా అన్నట్లు మ్యాచ్‌లు సాగనున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈక్రమంలో ఇవాళ ఐపీఎల్‌లో బిగ్ ఫైట్ జరగనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సన్స్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. పుణె వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈమ్యాచ్‌లో గెలిచిన జట్టుకే ప్లే ఆఫ్స్‌ అవకాశాలు మెరుగుపడాయి. ఓడిన జట్టు ఔట్ కాక తప్పని పరిస్థితి. దీంతో ఇరుజట్లు విజయంపై కన్నేశాయి. ఎలాగైనా మ్యాచ్‌పై పట్టుసాధించాలని భావిస్తున్నాయి. ఈసీజన్‌లో కోల్‌కతాను హైదరాబాద్ జట్టు మట్టికరిపించింది. ఇదే స్ఫూర్తితో మరో విజయం సాధించాలని విలియమ్సన్ సేన యోచిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతికారం తీర్చుకోవాలని కోల్‌కతా స్కెచ్‌లు వేస్తోంది. 


ఇప్పటివరకు హైదరాబాద్‌ టీమ్ 11 మ్యాచ్‌లు ఆడి ఆరింటిలో ఓడి..5 మ్యాచ్‌ల్లో గెలిచింది. మొదటి రెండు మ్యాచ్‌ తర్వాత వరుసగా 5 మ్యాచ్‌ల్లో ఎస్‌ఆర్‌హెచ్ విజయం సాధించింది. ఆ తర్వాత నాలుగింటిలో ఓటమి పాలైంది. పాయింట్ల పట్టికలో ఐదు విజయాలతో ఏడో స్థానంలో ఉంది. రన్‌రేట్ సైతం దారుణంగా ఉంది. మొదట్లో టాప్‌లోకి వెళ్లిన ఆ జట్టు..ఆ తర్వాత అదే స్పీడ్‌తో కిందకు వచ్చింది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌ జట్టు గెలిస్తే సులువుగా ప్లే ఆఫ్స్‌కు వెళ్లనుంది. ఓడితే మాత్రం ఇంటి బాట పట్టాల్సిందే. ఈమ్యాచ్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ చావోరేవో కానుంది. 17న ముంబై, 22న పంజాబ్‌తో హైదరాబాద్ తలపడనుంది.


ఇటు కోల్‌కతా(KOLKATA) జట్టు పరిస్థితి అలాగే ఉంది. 12 మ్యాచ్‌ల్లో తలపడిన ఆ జట్టు ఐదు విజయాలు సాధించింది..7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. శ్రేయస్ అయ్యర్ జట్టు రన్‌రేట్‌ మైనస్‌లో ఉంది. ఈమ్యాచ్‌లో భారీ విజయం సాధిస్తే రన్‌రేట్ మెరగయ్యే అవకాశం ఉంది. ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండనున్నాయి. ఓడితే మాత్రం ప్యాక్‌అప్‌ కావాల్సిందే. ఇవాళ హైదరాబాద్‌(SRH)తో, 18న లక్నో జట్టుతో కోల్‌కతా తలపడనుంది. 


Also read:Horoscope Today May 14 2022: రాశి ఫలాలు.. ఇవాళ ఆ రాశి వారి ఇంటికి అనుకోని అతిథి రావొచ్చు...


Also read:Delhi Fire Accident Tragedy: ఢిల్లీ అగ్ని ప్రమాదంలో 26కి చేరిన మృతుల సంఖ్య.. 12 మందికి గాయాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook