SRH VS DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ( IPL 2020 ) 11 మ్యాచ్ మంగళవారం సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. తొలి విజయం కోసం వేచి చూస్తున్న హైదరాబాద్, విజయాల పరంపర కొనసాగించాలి అనుకుంటున్న ఢిల్లీకి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ను సన్ రైజర్స్ టీమ్ 15 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో హైదరాబాద్ టీమ్ ఐపీఎల్ సీజన్ 13లో తన ఖాతాను తెరిచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ|  IPL 2020: ఐపీఎల్ లో ఎక్కువ సార్లు టీమ్స్ మార్చిన ప్లేయర్స్ వీరే


వీళ్లే మ్యాచు హీరోలు..
హైదరాబాద్ టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించిన వారిలో భువనేశ్వర్ కుమార్, రాషిద్ ఖాన్ పేర్లు ముందుగా చెప్పాలి. 
తన డేర్ అండ్ డ్యాషింగ్ బౌలింగ్ తో రాషిద్ ఖాన్ కీలకమైన 3 వికెట్లను పడగొట్టాడు. మరో ఎండ్ లో భువనేశ్వర్ కుమార్ ఢిల్లీకి చెందిన ఇద్దరు కీలక ఆటగాళ్లను పెవీలియన్ కు పంపించారు. 


బ్యాటింగ్ ను ఎంచుకున్న సన్ రైజర్స్


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచకున్న సన్ రైజర్స్ టీమ్ ఢిల్లీ ముందు 163 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ టీమ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది.



ALSO READ| Rice ATM : హైదరాబాద్ లో 12 వేల మంది కడుపు నింపిన రైస్ ఏటీఎం


మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ...
ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ను కట్టిడి చేసిన తన అద్భుతమైన బౌలింగ్ తో సన్ రైజర్స్ ఖాతాలో తొలి విజయం వచ్చేలా చేశాడు రాషీద్ ఖాన్. ఈ మ్యాచులో నాలుగు ఓవర్లు వేసి 14 పరుగులు మాత్రమే ఇచ్చిన రాషిద్ మూడు వికెట్లు తీశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు.



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR