Kane Williamson: స్వదేశానికి వెళ్లిపోయిన కేన్ మామ.. సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్ ఎవరంటే?
Kane Williamson back to New Zealand, miss rest of IPL 2022. ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్ తగిలింది. మరో కీలక మ్యాచ్ మిగిలిలుండగానే సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్వదేశానికి పయనమయ్యాడు.
Sunrisers Hyderabad Captain Kane Williamson will miss rest of IPL 2022: ఐపీఎల్ 2022లో భాగంగా మంగళవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులో గెలిచి.. ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్ తగిలింది. మరో కీలక మ్యాచ్ మిగిలిలుండగానే సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్వదేశానికి పయనమయ్యాడు. కేన్ సతీమణి సారా రహీం త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వాల్సి ఉండటంతో.. ఆమె పక్కన ఉండేందుకు సన్‌రైజర్స్ సారథి ఉన్నపళంగా న్యూజిలాండ్‌కు బయలుదేరాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ మే 22న లీగ్ దశలో తమ చివరి మ్యాచును పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది. ఈ కీలకమైన మ్యాచ్‌కు కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. ఇదే విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తన అధికారిక ట్విటర్ వేదికగా వెల్లడించింది. కేన్ గైర్హాజరీలో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ లేదా విండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ సన్‌రైజర్స్ జట్టుని నడిపించనున్నారు. దాదాపుగా పూరన్ చేతికే ఆరెంజ్ ఆర్మీ పగ్గాలు వెళ్లే అవకాశం ఉంది.
'మా కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన కుటుంబంలోకి రానున్న చిన్నారిని స్వాగతించడానికి న్యూజిలాండ్‌కు తిరిగి వెళ్తున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ క్యాంప్‌లోని ప్రతి ఒక్కరూ కేన్ సతీమణికి సురక్షితమైన ప్రసవం జరగాలని కోరుకుంటున్నారు. కేన్ కుటుంబంలో సంతోషం విరజిమ్మాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం' అని సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్వీట్ చేసింది. విలియమ్సన్ దంపతులకు 2020 డిసెంబర్‌లో అమ్మాయి జన్మించింది. ఆ సమయంలో కూడా కేన్ వెస్టిండీస్ పర్యటన నుంచి అర్ధంతరంగా వెళ్ళిపోయాడు.
ఐపీఎల్ 2022లో కేన్ విలియమ్సన్ 13 మ్యాచ్‌ల్లో 19.64 సగటున 93.51 స్ట్రైయిక్ రేటుతో 216 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటింగ్లో మాత్రమే కాకుండా కెప్టెన్సీలో కేన్ మామ విఫలమయ్యాడు. 13 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు మాత్రమే అందించాడు. కొన్ని గెలిచే మ్యాచులు కూడా కేన్ తప్పిదాల కారణంగా ఓడిపోయింది. ఇక ప్రస్తుతం లీగ్ పట్టికలో 13 మ్యాచ్‌లలో 12 పాయింట్లు సాధించి ఎనిమిదో స్థానంలో ఉంది సన్‌రైజర్స్. తక్కువ నెట్ రన్ రేట్ కారణంగా ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ (7వ స్థానం), కోల్‌కతా నైట్ రైడర్స్ (6వ స్థానం) తర్వాత ఉంది.
Also Read: 2 Buses Collide: సేలం జిల్లాలో రెండు బస్సుల ఢీ.. 40 మందికి గాయాలు (వీడియో)
Also Read: lady rams into Balakrhna house : బాలకృష్ణ ఇంటి గేటును ఢీకొట్టిన యువతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.