Kavya Maran Deep Fake Video: సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ ఎక్కడ జరుగుతున్నా.. ఆటగాళ్లతో పాటు మరో వ్యక్తిపై మాత్రం కెమెరామెన్ ఫోకస్ కచ్చితంగా ఉంటుంది. ఆమే ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ కావ్య మారన్. హైదరాబాద్‌ ఆడే ప్రతి మ్యాచ్‌లో కావ్య మారన్‌ సందడి కచ్చితంగా ఉంటుంది. ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాళ్లు వికెట్ తీసినా.. సిక్సర్లు, ఫోర్లతో చెలరేగినా చిన్న పిల్లలా మారిపోయి తెగ ఎంజాయ్‌ చేస్తుంది. హైదరాబాద్‌ మ్యాచ్‌ ఓడిపోతే.. ఈ అమ్మడి ఎక్స్‌ప్రెషన్స్‌ కూడా అలానే చాలా బాధగా ఉంటాయి. ఆమె ఎక్స్‌ప్రెషన్స్ నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా కావ్య మారన్‌ డీప్‌ ఫేక్‌ వీడియో వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల చాలామంది సెలబ్రిటీలు డీప్‌ ఫేక్ వీడియోల బారిన పడుతున్న విషయం తెలిసిందే. టెక్నాలజీ వాడకం పెరుగుతున్న కొద్దీ.. దుర్వినియోగం కూడా పెరుగుతోంది. నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవ్వగా.. ఇలాంటి పనులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ పెద్ద ఎత్తున వచ్చాయి. రష్మిక డీప్‌ ఫేక్ వీడియోను సినీ, రాజకీయ ప్రముఖులు ఖండించారు. అయినా ఇలాంటి ఘటనలు ఆగపోవడం ఆందోళన కలిగిస్తోంది. 


 



కావ్య మారన్, ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లేయర్ మార్క్రామ్ లిప్ టు లిప్ కిస్ పెట్టుకున్నట్లు వీడియోను క్రియేట్ చేశారు. ఈ డీప్‌ ఫేక్ వీడియోపై నెట్టింట అభిమానులు ఫైర్ అవుతున్నారు. అయితే ఈ డీప్ ఫేక్ వీడియోపై కావ్య మారన్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఈ వీడియోపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.


ఇక ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మంచి ఆటతీరు కనబరుస్తోంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించగా.. రెండింటిలో ఓడిపోయింది. ఆరు పాయింట్లతో టేబుల్‌లో ఐదో స్థానంలో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో ఎస్‌ఆర్‌హెచ్‌ అదరగొడుతోంది. ఒకరు విఫలమైనా మరో ఆటగాడు బాధ్యత తీసుకుని ఆడుతుండడం కలిసి వచ్చే అంశం. హైదరాబాద్‌ ఇదే ఆటతీరును కనబరిస్తే.. టైటిల్ ఫేవరేట్స్‌లో ఒకటిగా మారడం ఖాయం. 


Also Read: Glenn Maxwell: ఆర్‌సీబీ విలన్‌గా మారిన మ్యాక్స్‌వెల్.. వరల్డ్ కప్‌లో అలా.. ఐపీఎల్‌లో ఇలా..!


Also Read: Manchu Manoj: తండ్రి అయిన మంచు మనోజ్..పండంటి బిడ్డకు జన్మనిచ్చిన భూమా మౌనిక..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook