Manchu Manoj: తండ్రి అయిన మంచు మనోజ్..పండంటి బిడ్డకు జన్మనిచ్చిన భూమా మౌనిక..

Manoj Becomes Father: మంచు మనోజ్ రెండో వివాహం ఇటీవల భూమా మౌనికతో జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ మధ్యనే తాను ప్రెగ్నెంట్గా ఉన్న సంగతి కూడా సోషల్ మీడియా ద్వారా మంచు మనోజ్ తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం మౌనిక పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుస్తోంది..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 13, 2024, 04:11 PM IST
Manchu Manoj: తండ్రి అయిన మంచు మనోజ్..పండంటి బిడ్డకు జన్మనిచ్చిన భూమా మౌనిక..

Manchu Manoj: మంచు మనోజ్ గత సంవత్సరం మౌనికతో రెండో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ కూడా ఇది రెండవ వివాహమే. మంచు మనోజ్ కి ఇదివరకే పెళ్లయి విడాకులు కాగా.. భూమా మౌనికకి అప్పటికే ధైరవ్ అనే బాబు ఉన్నాడు. ఇక తమ మొదటి భాగస్వామ్యులతో విడాకులు తీసుకున్న వీరు ఇద్దరు ప్రేమలో పడితే గత సంవత్సరం పెళ్లి చేసుకున్నారు . పెళ్లి తరువాత వీరిద్దరూ పలుమార్లు వార్తల్లో కూడా నిలిచారు. ఇద్దరూ కలిసి ఓ కొత్త బిజినెస్ కూడా మొదలుపెట్టారు. తమ ఫ్యామిలీ ఫొటోలు కూడా మనోజ్, మౌనిక అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో పోయిన సంవత్సరం డిసెంబర్ లో మౌనిక ప్రగ్నెంట్ అని తెలిపాడు మనోజ్.

ఇక ఈ ప్రెగ్నెన్సీ న్యూస్ బయట పెట్టిన కొద్దిరోజులకే బేబీ బంప్ ఫొటోలని షేర్ చేశారు ఈ హీరో. అలానే సీమంతం కూడా చేశారు. ఇక వీరి ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఈరోజు మనోజ్ కి పాప పుట్టినట్టు తెలుస్తుంది. మంచు మనోజ్ కి పాప పుట్టిన విషయమై ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టిన మంచు లక్ష్మీ.. పాపకు 'ఎమ్ఎమ్ పులి' అని ముద్దు పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చింది. అలానే ధైరవ్ (మనోజ్ కొడుకు)కి చెల్లెలు వచ్చేసిందని లక్ష్మీ రాసుకొచ్చింది. ఇక ఈ వార్త బయట పెట్టిన పాపకి సంబంధించిన ఫోటోలు మాత్రం మంచు ఫ్యామిలీ బయట పెట్టలేదు.

‘మనోజ్ – మౌనిక మరోసారి తల్లితండ్రులయ్యారు. మా మంచు ఇంట్లో దేవత వచ్చింది. మనోజ్ – మౌనిక దంపతులు పండంటి పాపకి జన్మనిచ్చారు. అన్నగా ధైరవ్ సంతోషిస్తున్నాడు. అప్పుడే తనకి MM పులి అనే నిక్ నేమ్ కూడా పెట్టేసాము. శివుడి ఆశీస్సులు ఈ ఫ్యామిలీపై ఉండాలని కోరుకుంటున్నాను’ అని మంచు లక్ష్మి తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది.

 

ఇక ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ కాగా మంచు మనోజ్ ఫ్యామిలీకి అభిమానులు అందరూ బెస్ట్ విషెస్ చెబుతున్నారు.

Also Read: తెలుగు నేలతో బాబా సాహెబ్ అంబేద్కర్ అనుబంధం..

Also Read: ఖమ్మం పాలిటిక్స్ లో కీలక పరిణామం.. భట్టి, తుమ్మల ఏకమై.. పొంగులేటికి చెక్..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News