SRH should look to buy 5 players in IPL 2022 Auction: మరికొద్ది గంటల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం ఆరంభం కానుంది. సిలికాన్ సిటీ బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మెగా వేలం జరగనుంది. హోటల్ ఐటీసీ గార్డెనియాలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వేలం పాటను నిర్వహించనుంది. ఈసారి కొత్తగా గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఐపీఎల్ టోర్నీలో చేరడంతో మొత్తం 10 ఫ్రాంఛైజీలు ఆక్షన్‌లో పాల్గొననున్నాయి. మొత్తం 590 మంది ప్లేయర్స్ వేలంలో పాల్గొననున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022 వేలానికి ముందు నలుగురిని ఎంచుకునే అవకాశం ఉన్నా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ముగ్గురిని మాత్రమే అట్టిపెట్టుకున్న విషయం తెలిసిందే. కేన్ విలియమ్సన్ (14 కోట్లు), అబ్దుల్ సమద్ (4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్‌ (4 కోట్లు)లను మాత్రమే రిటైన్ చేసుకుంది. ఈ మెగా వేలంలో గతంలో కాకుండా స్టార్ ఆటగాళ్లను తీసుకుని జట్టును బలోపేతం చేయాలని సన్‌రైజర్స్ యాజమాన్యం ప్రణాళికలు వేసిందట. అందుకోసం భారీగా ఖర్చు చేసేందుకు కూడా వెనకాడడం లేదట. వేలం నేపథ్యంలో ఐదుగురు ఆటగాళ్లను దక్కించుకోవాలని సన్‌రైజర్స్ చూస్తోందట. ఆ వివరాలు ఓసారి చూద్దాం. 


జాసన్ రాయ్:
స్టార్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టోలను సన్‌రైజర్స్ వదులుకోవడంతో ఆ స్థానాలను భర్తీ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. గత సీజన్‌లో సన్‌రైజర్స్ జట్టుకు ఆడి ఆకట్టుకున్న ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ ని దక్కించుకోవాలని చూస్తోందట. అందుకోసం 5 కోట్లు కూడా ఖర్చు చేయనుందని సమాచారం. రాయ్ మంచి ఓపెనర్. క్రీజులోకి వచ్చిరావడంతోనే బౌండరీలు బాదగలడు. రాయ్ ఎంపిక సరైందే. 


శిఖర్ ధావన్:
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ యూనిట్‌లో అనుభవం తక్కువగా ఉంది. అందుకే వెటరన్ టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌ను ఎంచుకోవాలనుకుంటోందట. గబ్బర్ వస్తే ఓపెనర్‌గా ఉపయోగపడడమే సన్‌రైజర్స్ టాప్ ఆర్డర్ కూడా బలోపేతం అవుతుంది. ధావన్ కోసం ఎస్‌ఆర్‌హెచ్ భారీగానే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. గబ్బర్ కోసం 5 కోట్లు వెచ్చించనుందట. 


క్వింటన్ డికాక్:
దక్షిణాఫ్రికా వికెట్ కీపర్, బ్యాటర్ క్వింటన్ డికాక్‌కు ఐపీఎల్ 2022 వేలంలో మంచి ధర వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడి కోసం అన్ని ఫ్రాంచైజీలు ప్రయత్నాలు చేస్తాయి. ముంబై ఇండియన్స్ విడుదల చేసిన తర్వాత ప్రతి జట్టు ప్రణాళికలో డికాక్ ఉన్నాడు. ఓపెనర్‌గా భారీ ఇన్నింగ్స్‌లు ఆడడంలో డికాక్ పేరుగాంచాడు. అంతేకాకుండా వికెట్ కీపింగ్ కూడా చేయడం అతనికి కలిసొచ్చే అంశం. సన్‌రైజర్స్ ఖచ్చితంగా డికాక్ సేవలను ఉపయోగించుకోవాలనుకుంటోంది. అందుకోసం 7 కోట్లు కూడా పెట్టనుందట. డికాక్ చేరితే టాప్ ఆర్డర్ బలోపేతం అవుతుంది. 


యుజ్వేంద్ర చహల్:
స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను అట్టిపెట్టుకోవాలని చూసినా.. అతడు జట్టులో ఉండనని చెప్పి గుజరాత్ టైటాన్స్‌లో చేరాడు. దాంతో సన్‌రైజర్స్ స్పిన్ బౌలింగ్ విభాగం బలహీనపడింది. రషీద్ లాంటి ఆటగాడి కోసం సన్‌రైజర్స్ వేటలో ఉంది. బెంగళూరు నుంచి బయటికొచ్చిన టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ ఫోకస్ పెట్టింది. అతడి కోసం 6 కోట్లు ఖర్చు చేయనుందట. 


జోష్ హేజిల్‌వుడ్:
భువనేశ్వర్ కుమార్, నటరాజన్, సందీప్ శర్మ, సిద్దార్థ్ కౌల్, జాసన్ హోల్డర్ లాంటి పేసర్లను ఎస్‌ఆర్‌హెచ్‌ వదులుకుంది. ప్రస్తుతం పేస్ విభాగంను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకే ఐపీఎల్ 2021లో చెన్నైకి, టీ20 ప్రపంచకప్ 2021లో ఆస్ట్రేలియాకు టైటిల్ అందించిన జోష్ హేజిల్‌వుడ్‌ను తీసుకునేందుకు ఆసక్తిగా ఉందట. అందుకోసం 6 కోట్లు పెట్టనుందట. ఈ ఐదుగురిలో ముగ్గురు జట్టులోకి వచ్చినా ఎస్‌ఆర్‌హెచ్‌ బలోపేతం అవుతుంది. 


Also Read: Kalaavathi Song Promo: 'సూపర్ స్టార్' అభిమానులకు సర్‌ప్రైజ్‌.. ఫస్ట్ సింగిల్ అదిరిపోయిందిగా!!


Also Read: IND vs WI: విండీస్ టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. ఇద్దరు స్టార్ ప్లేయర్స్ దూరం!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook