Sunrisers Hyderabad Players List and Price: రెండు రోజులపాటు ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. అన్ని ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్ల కోసం కోట్లు ఖర్చు పెట్టాయి. రిషబ్ పంత్ ఈసారి వేలంలో అన్ని రికార్డులు బద్దలు కొట్టారు. రూ.27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ పంత్‌ను తీసుకుంది. శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్లు దక్కించుకున్నాడు. పంజాబ్ కింగ్స్ వేలంలో పోటీ మరి అయ్యర్‌ను దక్కించుకుంది. ఈ వేలంలో మరో స్పెషల్ ప్లేయర్ ఎవరంటే 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్‌కు ఎంపికైన పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. రాజస్థాన్ రాయల్ ఈ యంగ్ ప్లేయర్‌ను రూ.కోటి 10 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Huge Discount: ఫ్లిఫ్‌కార్ట్‌లో బోట్ ఎయిర్‌డోప్స్ రూ.799కే.. ఈ లక్కీ ఆఫర్‌ మిస్‌ కావొద్దు! మళ్లీ రాదు ఇంకా..


ఈసారి వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వ్యహాత్మంగా వ్యవహరించింది. కెప్టెన్ పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డిని రిటైన్ చేసుకున్న ఎస్‌ఆర్‌హెచ్.. వేలంలో మరో 15 మంది ప్లేయర్లను తీసుకుంది. రూ.45 కోట్ల పర్స్‌తో వేలంలోకి వెళ్లిన సన్‌రైజర్స్.. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ను రూ.11.25 కోట్లకు, స్టార్ పేసర్ మహ్మద్ షమీ కోసం రూ.10 కోట్లు ఖర్చు చేసింది. డెత్ ఓవర్‌ స్పెషలిస్ట్ హర్షల్ పటేల్‌ను రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది. రూ.కోటిన్నరకు సిమర్జీత్ సింగ్‌ను, రూ.కోటికి జయదేవ్ ఉనద్కత్‌, బ్రైడన్ కార్సేను తీసుకుంది. 


ముగ్గురు స్పిన్నర్లను వేలంలో కొనుగోలు చేసింది. రూ.3.20 కోట్లకు రాహుల్ చాహర్‌ను సొంతం చేసుకోగా.. ఆడమ్ జంపా కోసం రూ.2.40 కోట్లు వెచ్చించింది. అన్‌క్యాప్డ్‌ ప్లేయర్ జీషన్ అన్సారీని రూ.40 లక్షలకు తీసుకుంది. హిట్టర్ అభినవ్ మనోహర్‌ను రూ.3.20 కోట్లకు కొనుగోలు చేసింది. శ్రీలంక ప్లేయర్లు ఇషాన్ మలింగను రూ.1.20 కోట్లకు, కామిందు మెండిస్‌ కోసం రూ.75 లక్షలు ఖర్చు చేసింది. అథర్వ టైడే, అనికేత్ వర్మ, సచిన్ బేబీ వంటి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లకు చెరో రూ.30 లక్షలకు తీసుకుంది. వేలం ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్‌ పర్స్‌లో రూ.20 లక్షలు మాత్రమే మిగిలిలాయి. టీమ్‌లో మొత్తం 20 మంది ప్లేయర్లు అయ్యారు.


రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల ధర: పాట్ కమిన్స్ (రూ. 18 కోట్లు), అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు), నితీష్ రెడ్డి (రూ.6 కోట్లు), హెన్రిచ్ క్లాసెన్ (రూ.23 కోట్లు), ట్రావిస్ హెడ్ (రూ.14 కోట్లు).


వేలంలో తీసుకున్న ప్లేయర్లు: ఇషాన్ కిషన్ (రూ.11.25 కోట్లు), మహ్మద్ షమీ (రూ.10 కోట్లు), హర్షల్ పటేల్ (రూ.8 కోట్లు), రాహుల్ చాహర్ (రూ. 3.2 కోట్లు), ఆడమ్ జంపా (రూ.2.40 కోట్లు), అథర్వ తైదే (రూ.30 లక్షలు), అభినవ్ మనోహర్ (రూ.3.20 కోట్లు), సిమర్‌జీత్ సింగ్ (రూ.1.50 కోట్లు), జీషన్ అన్సారీ (రూ.40 లక్షలు), జయదేవ్ ఉనద్కత్ (రూ.కోటి), బ్రైడన్ కార్సే (రూ.కోటి), కమిందు మెండిస్ (రూ.75 లక్షలు), అనికేత్ వర్మ (రూ.30) లక్ష), ఎషాన్ మలింగ (రూ.1.20 కోట్లు), సచిన్ బేబీ (రూ.30 లక్షలు).


తుది జట్టు ఇలా (అంచనా): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అభినవ్ మనోహర్, ఎషాన్ మలింగ, పాట్ కమిన్స్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్.


Also Read: KTR Vs Cm Revanth Reddy: నీలాగా లుచ్ఛా పనులు అలవాటు లేదు.. సీఎం రేవంత్‌పై మరోసారి నిప్పులు చెరిగిన కేటీఆర్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.