IPL Points 2024 table Updated: ఐపీఎల్ లో బంతికి, బ్యాట్ కు మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. జట్లన్నీ నువ్వా-నేనా అన్న రీతిలో తలపడుతున్నాయి. ఈ మెగా టోర్నీ ప్రారంభమై వారం కావాస్తోంది. ఇప్పటి వరకు మెుత్తం ఎనిమిది మ్యాచ్‌లు జరిగాయి. అప్పుడే పాత రికార్డులన్నీ గల్లంతు అవుతున్నాయి. నిన్న ముంబై ఇండియన్స్- సన్ రైజర్స్ మ్యాచ్ లో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి.  ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు(277 పరుగులు) సాధించిన జట్టుగా ఎస్ హెర్ఆచ్ నిలిచింది. అంతేకాకుండా టీ20 హిస్టరీలోనే అత్యధిక సిక్సర్లు(38) నమోదైన మ్యాచ్ గా ఇది చరిత్రలో నిలిచిపోయింది. ఈ రెండు టీమ్స్ కలిసి 523 పరుగుల చేయడం టీ20 క్రికెట్ లోనే అతి పెద్ద రికార్డు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్న ముంబైపై గెలవడం ద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్-3లోకి దూసుకొచ్చింది. ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిన ముంబై అట్టడుగు స్థానానికి దిగజారింది.  అగ్రస్థానంలో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనసాగుతోంది. ఆ జట్టు ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచి నాలుగు పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. ఇక రెండో స్థానంలో సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు ఉంది. రాయల్స్ ఆడిన ఒక మ్యాచ్ లోనే భారీ తేడాతో నెగ్గి సెకండ్ ఫ్లేస్ లో కొనసాగుతోంది. మెున్నటి వరకు ఆరో స్థానంలో ఉన్న సన్ రైజర్స్.. నిన్న ముంబైను ఓడించి మూడో స్థానానికి ఎగబాకింది. హైదరాబాద్ ఆడిన రెండు మ్యాచుల్లో ఒక మ్యాచ్ గెలిచి రెండు పాయింట్లతో +0.675 రన్ రేట్ తో మూడో ఫ్లేస్ లో ఉంది. 


Also Read: Hardik Pandya Emotional: స‌న్‌రైజ‌ర్స్‌ సూపర్ విక్టరీ.. కన్నీళ్లు పెట్టుకున్న హార్దిక్ పాండ్యా, వీడియో వైరల్


ఆ తర్వాత స్థానాల్లో కేకేఆర్, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ ఉన్నాయి. చివరి స్థానంలో లక్నో ఉండగా.. దాని కంటే పైన ముంబై ఉంది. ఐపీఎల్‌లో ఇవాళ జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగబోతుంది. దీంతో పాయింట్ల పట్టికలో మళ్లీ భారీ కుదుపు రానుంది. 


Also Read: SRH vs MI Live Score: చరిత్ర తిరగరాసిన సన్‌రైజ‌ర్స్.. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోరు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి