SRH vs MI Live Score: హైదరాబాద్ లో ముంబై బౌలర్లను ఊచకోత కోశారు సన్ రైజర్స్ బ్యాటర్లు. వచ్చిన బంతిని వచ్చినట్లు స్టాండ్స్ లోక పంపారు. దీంతో హార్దిక్ సేనకు బాల్ ఎక్కడ వేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ సీజన్ లో ఫాసెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు ట్రావిస్ హెడ్. అంతేకాకుండా ఐపీఎల్ హిస్టరీలోనే రికార్డు స్కోరు సాధించింది ఎస్ హెర్ఆచ్. గత రికార్డులను బద్దలుకొడుతూ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. గతంలో ఈ రికార్డు ఆర్సీబీ పేరిట ఉండేది. 2013లో ఆ జట్టు 263 పరుగులు చేసింది. ఇప్పుడు ఆ రికార్డును సన్ రైజర్స్ బ్రేక్ చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ కు ఆదిలోనే దెబ్బ తగిలింది. మయాంక్ ఆగర్వాల్ 11 పరుగుల మాత్రమే చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న హెడ్ వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలో ఫాసెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 18 బంతుల్లో అర్థశతకం సాధించారు. ఇందులో 9 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు అభిషేక్ వర్మ కూడా పూనకం వచ్చినట్లు ముంబై బౌలర్లను ఉతికారేశాడు. వీరిద్దరూ సిక్సర్లు, ఫోర్లుతో వీరబాదుడు బాదారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని కోయెట్జ్ విడదీశాడు. హెడ్ ను ఔట్ చేసి ముంబై బ్రేక్ ఇచ్చాడు. అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలువలేదు.
అభిషేక్ కు మారక్రమ్ కూడా తోడవ్వడంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. ఈ క్రమంలో అభిషేక్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మాంచి ఊపు మీదున్న అభిషేక్ ను ఫీయూష్ చావ్లా ఔట్ చేశాడు. కేవలం 23 బంతుల్లోనే 3 ఫోర్లు, ఏడు సిక్సర్లుతో 63 పరుగుల చేశాడు. అసలైన విధ్వంసం అప్పుడే మెుదలైంది. క్లాసన్ వచ్చిరాగానే ముంబై బౌలర్లను ఊచకోత కోశాడు. మార్కక్రమ్ తో కలిసి అద్భుతమైన పార్టనర్ షిప్ నెలకొల్పాడు. దీంతో సన్ రైజర్స్ ఆటముగిసే సమయానికి 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 277 పరుగుల చేసింది. క్లాసెన్ 34 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్లుతో 80 పరుగులు చేశాడు. మార్కక్రమ్ 42 పరుగులు బాదాడు.
Also Read: Shubman Gill: టైటాన్స్‌కు మరో షాక్.. కెప్టెన్ శుభమన్ గిల్‌కు భారీగా ఫైన్.. ఎందుకంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి