SRH Practice Video: ఐపీఎల్ సీజన్ 15 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. టైటిల్‌పై దృష్టి సారించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రాక్టీసు ముమ్మరం చేసింది. ఆరెంజ్ ఆర్మీ పేస్ బౌలర్ వికెట్లు విరగ్గొట్టేస్తున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022 మార్చ్ 26 నుంచి అంటే మరో నాలుగు రోజుల్లో మొదలు కానుంది. ముంబై, పూణేల్లోని స్టేడియంలు ఇందుకు సిద్ధమయ్యాయి. వివిధ జట్లు ఇప్పటికే ప్రాక్టీసు ముమ్మరం చేశాయి. గత సీజన్‌లో ఘోరంగా విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు..పూర్తిగా పుంజుకుంది. కొత్త ఆటగాళ్లను చేర్చుని ప్రాక్టీసు వేగవంతం చేసింది. టైటిల్ సాధనే ధ్యేయంగా ప్రయత్నాలు ప్రారంభించింది. టైటిల్ కోసం శాయశక్తులా ప్రయత్నించే క్రమంలో భాగంగా ప్రాక్టీసు ఎలా చేస్తున్నామనేది ఓ వీడియో రూపంలో విడుదల చేసింది. ఆ వీడియోనే ఇప్పుుడు వైరల్ అవుతోంది.



ముంబైలోని క్యాంపులో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్ల ప్రాక్టీసు దృశ్యమిది. ఈ ప్రాక్టీసు సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పేస్ బౌలర్ టి నటరాజన్ అద్భుతమై స్పెల్..అందర్నీ ఆకట్టుకుంటోంది. సింగిల్ వికెట్ ప్రాక్టీసులో ఏకంగా వికెట్ పడగొట్టడమే కాదు..ఆ స్పీడ్‌కు వికెట్ రెండుగా విరిగిపోయింది కూడా. అద్భుతమైన నటరాజన్ స్పెల్ వీడియో వైరల్ అవుతోంది. మార్చ్ 29వ తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తన తొలి మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ప్రారంభించనుంది. 


ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన క్రికెట్ లీగ్‌కు ఆటగాళ్లు ఎలా సిద్ధమవుతున్నారనే విషయాన్ని షేర్ చేసే క్రమంలో ఈ వీడియోను పంచుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు. 30 ఏళ్ల తమిళనాడు ఆటగాడు నటరాజన్ తన అద్భుతమైన బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా.. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు. ఆ తరువాత 2021 లో మోకాలి గాయంతో శస్త్రచికిత్స చేయించుకుని చాలా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2022కు పూర్తిగా ఫిట్ అయి..సిద్ధమయ్యాడు. 8.23 ఎకానమీ రేటుతో..34 సగటుతో 20 వికెట్లు పడగొట్డాడు. 


Also read: ICC Women World Cup 2022: బంగ్లాదేశ్‌పై భారీ విజయం, ఇండియా మహిళల జట్టు సెమీస్ ఆశలు సజీవం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook