Umran Malik: అతడి వేగం గంటకు 150 కిలోమీటర్లు. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఈ క్రికెటర్‌కు ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా బాల్ విసిరి తొలి ఇండియన్‌గా పేరు కూడా ఉంది. త్వరలో టీమ్ ఇండియాకు ఆడతానంటున్న ఆ క్రికెటర్ గురించి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రిటైన్ చేసుకున్న ఫాస్టెస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఈ పేసర్ గంటకు 152 కిలోమీటర్ల వేగంతో బౌల్ విసిరిన ఆటగాడు. ఐపీఎల్ చరిత్రలో ఇదే రికార్డు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్ జట్టు తరపున రంజీ అద్భుతంగా ఆడుతున్నాడు. ఐపీఎల్ 2022 కు ముందే ఎస్ఆర్‌హెచ్ జట్టు 4 కోట్లకు ఇతడిని రిటైన్ చేసుకుంది. కెరీర్ పరంగా తన అభివృద్ధికి టీమ్ ఇండియా మాజీ పేసర్ ఇర్భాన్ పఠాన్ పాత్ర కీలకమైందని ఉమ్రాన్ మాలిక్ చెప్పాడు. జమ్ముకశ్మీర్ కోచ్‌గా ఇర్ఫాన్ పఠాన్ ఉన్నప్పుడు సహాయం చేసేవాడన్నాడు. తన బౌలింగ్ వీడియోల్ని అతనికి పంపుతూ..సలహాలు తీసుకునేవాడినన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు ఇండియా ఎ జట్టు తరపున ఆడటం ఎప్పటికీ మర్చిపోలేనంటున్నాడు. వీలైనంత త్వరగా టీమ్ ఇండియాకు ఆడాలనేదే తన కోరిక అని ఉమ్రాన్ మాలిక్ స్పష్టం చేశాడు. 


ఐపీఎల్ 2022 తరపున స్టార్ ఆటగాళ్లను పక్కనబెట్టి తనను ఎస్ఆర్‌హెచ్ జట్టు రిటైన్ చేసుకోవడంపై చాలా గర్వంగా ఉందన్నాడు. ఐపీఎల్ 2021లో కేవలం మూడు మ్యాచ్‌లే ఆడినా..మంచి గుర్తింపు పొందానంటున్నాడు. అందుకే ఎస్ఆర్‌హెచ్ జట్టు తనను 4 కోట్లకు రిటైన్ చేసుకుందన్నాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్న ఉమ్రాన్ మాలిక్..ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో నటరాజన్ స్థానంలో జట్టులోకి వచ్చి అందర్నీ ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో ఆర్సీబీపై 152.95 స్పీడ్‌తో బౌలింగ్‌ వేసిన ఉమ్రాన్‌.. ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగంతమైన డెలివరీ వేసిన తొలి భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.


Also read: James Faulkner PCB: ఆస్ట్రేలియా ఆటగాడిపై జీవితకాల నిషేధం విధించిన పీసీబీ.. కారణం ఏంటంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook