James Faulkner PCB: ఆస్ట్రేలియా ఆటగాడిపై జీవితకాల నిషేధం విధించిన పీసీబీ.. కారణం ఏంటంటే?

James Faulkner Banned from PSL for Life: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్కనర్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జీవితకాల నిషేధం విధించింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో ఆడకుండా అతడిని బ్యాన్ చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2022, 12:34 AM IST
  • ఫీజు చెల్లంచలేదంటూ ఆసీస్ క్రికెటర్ వాకౌట్
  • ఇంకా వారు అబద్ధాలు చెప్తూనే ఉన్నారు
  • ఆస్ట్రేలియా ఆటగాడిపై జీవితకాల నిషేధం విధించిన పీసీబీ
James Faulkner PCB: ఆస్ట్రేలియా ఆటగాడిపై జీవితకాల నిషేధం విధించిన పీసీబీ.. కారణం ఏంటంటే?

Australia Cricketer James Faulkner Banned from PSL for Life: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్కనర్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జీవితకాల నిషేధం విధించింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో ఆడకుండా అతడిని బ్యాన్ చేసింది. ఒప్పందంలో భాగంగా పీసీబీ తనకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఇప్పటి వరకు ఇవ్వలేదని ఫాల్కనర్‌ చేసిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని పాక్ బోర్డు స్పష్టం చేసింది. హోటల్‌లోని ఆస్తికి ఉద్దేశపూర్వకంగానే ఫాల్కనర్‌ ధ్వసం చేశాడని పేర్కొంది. ఏదేమైనా సొంతగడ్డపై అంతర్జాతీయ క్రికెట్‌ను పునరుద్దరించాలనే లక్ష్యంతో ఉన్న పీసీబీకి ఇది కాస్త ఎదురుదెబ్బే అని చెప్పాలి. 

పీఎస్‌ఎల్ 2022లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జేమ్స్ ఫాల్కనర్ క్వెట్టా గ్లాడియేటర్స్ ప్రాంచైజీకి ఆడుతున్నాడు. అయితే ఒప్పందంలో భాగంగా తనకు చెల్లించాల్సిన మొత్తాన్ని పీసీబీ, క్వెట్టా ప్రాంచైజీ ఇప్పటి వరకు ఇవ్వలేదని ట్విటర్ వేదికగా ఆరోపణలు చేశాడు. 'పాకిస్థాన్​ క్రికెట్​ అభిమానులకు క్షమాపణలు. దురదృష్టవశాత్తు మరో రెండు మ్యాచ్​లు మిగిలి ఉండగానే లీగ్​ నుంచి తప్పుకుంటున్నా. పీసీబీ, క్వెట్టా గ్లాడియేటర్స్ నాకు రావాల్సిన ఫీజును చెల్లించకపోవడమే ఇందుకు కారణం. నేను ఇంతకాలం డబ్బు కోసం ఆగినా.. ఇంకా వారు అబద్ధాలు చెప్తూనే ఉన్నారు' అని ఫాల్కనర్ ట్వీట్ చేశాడు.

'పాకిస్థాన్​లో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభమవ్వడానికి నా వంతు కృషి చేద్దామని ఇక్కడకు వచ్చాను. అందుకు నాకు తగిన శాస్త్రి జరిగింది. ఇలా మధ్యంతరంగా వెళ్లి పోవడం బాధగానే ఉంది. పాకిస్తాన్‌లో చాలా యువ ప్రతిభ మరియు మంచి అభిమానులు ఉన్నారు కానీ ఇక్కడ నాతో బోర్డు వ్యవహరించిన తీరు నచ్చలేదు. మీరందరూ నా పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా' అని జేమ్స్ ఫాల్కనర్‌ వరుస ట్వీట్లు చేశాడు. ఫాల్కనర్ చేసిన​ ఆరోపణలను పీసీబీ, క్వెట్టా​ మేనేజ్‌మెంట్ కొట్టిపారేసాయి. అవన్నీ అర్థరహితమైన ఆరోపణలని పేర్కొన్నాయి. 

'జేమ్స్ ఫాల్కనర్​ ఇలా మాపై ఆరోపణలు చేసినందుకు చింతిస్తున్నాం. గతేడాది నుంచే పీఎస్​ఎల్‌లో భాగమైన ఫాల్కనర్​ను బాగా చూసుకున్నాం. ఇన్ని ఏళ్లలో ఏ ఆటగాడు కూడా మాపై ఫిర్యాదులు చేయలేదు. అతనికి ఇవ్వాల్సిన మొత్తాన్ని 70 శాతం ముందుగానే ఇచ్చేశాం. మిగిలిన 30 శాతం పీఎస్‌ఎల్ ముగిసిన 40 రోజులకు ఇస్తామని అగ్రీమెంట్‌లో స్పష్టంగా చెప్పాము. కావాలనే పీసీబీపై ఇలాంటి  ఆరోపణలు చేస్తున్నాడు' అని పీసీబీ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది.

'జేమ్స్ ఫాల్కనర్ క్రమశిక్షణా శైలి కూడా బాగాలేదు. హోటల్‌లోని ఆస్తిని ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశాడు. తన బ్యాటుతో అక్కడి వస్తువులను పగలగొట్టాడు. అందుకు అతడు నష్టపరిహారం చెల్లించాలి. విమానాశ్రయంలో ఫాల్క్‌నర్ ప్రవర్తన అనుచితంగా ఉందని ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి కూడా ఫిర్యాదులు అందాయి. భవిష్యత్తులో పాక్ సూపర్ లీగ్ ఆడకుండా అతడిపై నిషేధం విధిస్తున్నాం' అని పీసీబీ పేర్కొంది. 2015 వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా టీమ్‌లో ఫాల్కనర్ సభ్యుడు. 

Also Read: Ester Comments On Tollywood: అందుకు నో చెప్పానని ఛాన్సులు ఇవ్వలేదు.. టాలీవుడ్ హీరోలపై ఏస్తర్ సంచలన వ్యాఖ్యలు!

Also Read: Viral Videos: నీకో దండంరా సామీ.. అడవిలో నక్కనే కూర్చోబెట్టి మ్యూజిక్ వినిపించిన ఘనుడు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News