Suresh Raina: ఐపీఎల్ 2020 గుర్తుందిగా.. సురేష్ రైనా లేకుంటే చెన్నై పనైపోయినట్టే!
Suresh Raina memes trend online. మూడు వరుస పరాజయాల తర్వాత చెన్నై అభిమానులు నిరాశ చెందారు. ఇక చెన్నైపై ట్విట్టర్ వినియోగదారులు అయితే విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సురేష్ రైనాను జట్టులోకి తిరిగి రావాలని కొందరు ఫాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
Suresh Raina memes trend on Twitter after CSK's three successive defeats: ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. 15వ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. మొదటి మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఓడిపోయిన చెన్నై.. రెండో మ్యాచులో కొత్త ప్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై ఓటమిపాలైంది. ఇక ఆదివారం బ్రబౌర్న్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఓడిపోయి హ్యాట్రిక్ పరాజయాలను ఖాతాలో వేసుకుంది.
మూడు వరుస పరాజయాల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానులు నిరాశ చెందారు. ఇక చెన్నైపై ట్విట్టర్ వినియోగదారులు అయితే విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సురేష్ రైనాను జట్టులోకి తిరిగి రావాలని కొందరు ఫాన్స్ డిమాండ్ చేస్తున్నారు. 'ఆత్మ లేని శరీరాన్ని మీరు ఊహించగలరా?, గుండె చప్పుడు లేని గుండెను ఊహించగలరా?, అదే విధంగా సురేష్ రైనా లేని చెన్నైని ఊహించగలరా?' అని అభిమాని కామెంట్ చేయగా.. '2020లో రైనా లేకుంటే చెన్నై చెత్త ప్రదర్శన చేసింది, 2021లో రైనా ఉంటే విజేతగా నిలిచింది, 2022లో రైనా లేడుగా.. ఇక చెన్నై పనిఅంతే' అని ఇంకొకరు ట్వీట్ చేశారు.
అభిమానుల కామెంట్లతో సురేష్ రైనా పేరు ట్విటర్‌లో మార్మోగిపోతోంది. ప్రస్తుతం రైనా పేరు ట్రేండింగ్‌లో ఉంది. ఐపీఎల్ 2022 మెగా వేలంలో టీమిండియా మాజీ బ్యాటర్, మిస్టర్ ఐపీఎల్ రైనా అమ్ముడుపోని విషయం తెలిసిందే. కనీస ధర రూ. 2 కోట్లతో వేలంలోకి వచ్చిన రైనాను ఏ జట్టు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. వేలంలో అతడి పేరు రెండు సార్లు వచ్చినా.. ఒక్క ప్రాంచైజీ కూడా కొనలేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆడిన చెన్నై కూడా రైనాను కొనేందుకు ముందుకు రాలేదు.
సురేష్ రైనా 2008 నుంచి 2015 వరకూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకే ఆడాడు. చెన్నైపై రెండేళ్ల నిషేధం పడినప్పుడు.. 2016, 2017లో గుజరాత్ లయన్స్ జట్టుకు ఆడాడు. అనంతరం 2018 నుంచి 2021 వరకూ చెన్నైలోనే కొనసాగాడు. ఐపీఎల్ చరిత్రలో నాలుగో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఉన్నాడు. రైనా 205 ఐపీఎల్ మ్యాచుల ఆడి 5528 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Also Read: Rajat Patidar: బెంగళూరుకు ఎదురుదెబ్బ.. కీలక ఆటగాడు దూరం! పాటిదార్ వచ్చేశాడు
Also Read: Anasuya Bharadwaj: మీరు మగజాతి పరువు తీస్తున్నారు.. నెటిజన్‌పై మండిపడ్డ అనసూయ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook