Luvnith Sisodia ruled out from IPL 2022, Rajat Patidar joins RCB Squad: ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆర్‌సీబీ యువ ఆటగాడు లవ్‌నీత్ సిసోడియా గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఐపీఎల్ 15వ సీజన్‌లో ఇప్పటివరకు అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కర్ణాటకకు చెందిన ఈ యువ ఆటగాడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు. ఏడాది సీజన్ కోసం మెగా వేలంలో 20 లక్షలకు సిసోడియాను ఆర్‌సీబీ కొనుగోలు చేసింది.
లవ్‌నీత్ సిసోడియా స్థానంలో మధ్యప్రదేశ్‌కు చెందిన యువ ఆటగాడు రజత్ పాటిదార్‌ను ఆర్‌సీబీ యాజమాన్యం తీసుకుంది. గత సీజన్‌లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించిన పాటిదార్ పర్వాలేదనిపించాడు. అయితే ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు అతడిని ఆర్సీబీ రిటైన్ చేసుకోలేదు. వేలంలోనూ పాటిదార్‌ను తీసుకునేందుకు ఏ జట్టు ఆసక్తి చూపలేదు. చివరు ఆర్‌సీబీనే అతడిని కొనుగోలు చేసింది. దేశీయ స్థాయిలో 31 టీ20 మ్యాచ్‌లు ఆడిన పాటిదార్ 861 పరుగులు చేశాడు.
మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన తదుపరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ వాంఖడే మైదానంలో మంగళవారం రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది. ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు.. ఒక్క మ్యాచ్‌లో గెలిచి మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. ప్రస్తుతం పాయింట్ టేబుల్‌లో రెండు పాయింట్లతో ఏడు స్థానంలో ఉంది. ఈసారి ఎలాగైనా ట్రోఫీ కొట్టాలని ఆ జట్టు భావిస్తోంది.
Also Read: Anasuya Bharadwaj: మీరు మగజాతి పరువు తీస్తున్నారు.. నెటిజన్‌పై మండిపడ్డ అనసూయ!
Also Read: SRH Playing XI vs LSG: స్టార్ పేసర్ ఔట్.. శ్రేయాస్ ఇన్! లక్నోతో బరిలోకి దిగే సన్‌రైజర్స్ జట్టు ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook