Suresh Raina announce retirement from all formats of Cricket: రెండు సంవత్సరాల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా ప్లేయర్ సురేశ్ రైనా.. మంగళవారం (సెప్టెంబర్ 6) అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. ఈ నిర్ణయాన్ని మిస్టర్ ఐపీఎల్ తన ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. రైనా తాజా నిర్ణయంతో దేశవాళీ క్రికెట్‌తో పాటుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)కు రిటైర్మెంట్ ప్రకటించినట్టే. రైనా నిర్ణయంతో అతడి అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 2021లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున రైనా చివరిసారిగా మైదానంలోకి బరిలోకి దిగాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ఇన్ని సంవత్సరాలు భారత దేశానికి, నా రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నా. నా సామర్థ్యాలపై విశ్వాసం ఉంచి.. నాకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచిన బీసీసీఐ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్, రాజీవ్‌ శుక్లా సర్‌ మరియు నా అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా' అని సురేశ్ రైనా ట్వీట్ చేశాడు.


2020 ఆగస్టు నెలలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సురేష్ రైనా.. ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతూ వచ్చాడు. ఐపీఎల్ 2020 కోసం యూఏఈ వెళ్లిన మిస్టర్ ఐపీఎల్.. లీగ్ ఆరంభానికి ముందే వ్యక్తిగత కారణాలతో భారత్ వచ్చేశాడు. ఐపీఎల్ 2021లో ఆడిన రైనా.. ఒక హాఫ్ సెంచరీ మినహా పెద్దగా ఆడలేదు. దాంతో 2022కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ వేలంలోకి వదిలేసింది. వేలంలో పాల్గొన్న రైనాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దీంతో వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిస్టర్‌ ఐపీఎల్‌ మిగిలిపోయాడు. ఇప్పుడు అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. 



విదేశీ టీ20 లీగ్‌లలో ఆడేందుకు సురేష్ రైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. విదేశీ టోర్నీలో ఆడాలంటే.. బీసీసీఐ నిర్వహించే అన్ని ఫార్మాట్‌ల క్రికెట్‌ నుంచి తప్పుకోవాలనే నిబంధన ఉన్న విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇటీవల దక్షిణాఫ్రికా లీగ్‌లో జట్టును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ జట్టుకు రైనా కెప్టెన్ అవ్వడం పక్కగా కనిపిస్తోంది. 


Also Read: భారత్ vs శ్రీలంక మ్యాచ్‌ను ఫ్రీగా చూడొచ్చు.. స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్ స్టార్‌లో మాత్రం కాదు!


Also Read: చహల్‌ వద్దు.. అతడేనే తుది జట్టులో ఆడించండి! శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు గంభీర్ సలహా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook