Suryakumar Yadav ICC Men's T20I Cricketer of the Year 2022: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. గతేడాది టీ20 మ్యాచ్‌ల్లో అదరగొట్టిన సూర్య.. ఉత్తమ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికయ్యాడు. ఈ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 2022లో అంతర్జాతీయ టీ20లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. గతేడాది 31 మ్యాచ్‌లు ఆడిన సూర్య.. 46.56 సగటుతో 187.43 స్ట్రైక్ రేట్‌తో 1164 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు ఉన్నాయి. భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) సూర్యకు ప్రత్యేకంగా అభినందనలు ట్వీట్‌ తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతేడాది సూర్యకుమార్ యాదవ్ ప్రత్యర్థి బౌలర్లను చితక్కొట్టాడు. జట్టు ఏదైనా క్రీజ్‌లోకి దిగిన తరువాత ఆకాశమే హద్దుగా సిక్సర్ల వర్ష కురిపించాడు. ఏకంగా 68 సిక్సర్లు, 106 ఫోర్లు కొట్టాడు. జింబాబ్వేకు చెందిన సికందర్ రజా, ఇంగ్లాండ్‌కు చెందిన సామ్ కర్రన్, పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్‌లను ఓడించి సూర్యకుమార్ యాదవ్ ఈ అవార్డును గెలుచుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాట్స్‌మెన్ కూడా. 
ఐసీసీ ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ క్రికెటర్‌గా నిలిచాడు.




అదేవిధంగా ఒక క్యాలెండర్ ఇయర్‌లో టీ20 క్రికెట్‌లో 1000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి భారతీయ క్రికెటర్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న సూర్య ఖాతాలో 908 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. మొత్తం టీ20 కెరీర్‌లో 45 టీ20 మ్యాచ్‌లు ఆడిన సూర్య.. 46.41 సగటుతో, 180.34 స్ట్రైక్ రేట్‌తో 1578 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి.


ఈ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఇది గొప్ప అనుభూతి అని చెప్పాడు. 2022 తనకు వ్యక్తిగతంగా అద్భుతంగా సాగిందన్నాడు. గతేడాది ఆడిన కొన్ని ఇన్నింగ్స్‌లు చాలా బాగా ఆస్వాదించానని అన్నాడు. అత్యధిక ఇన్నింగ్స్‌లలో ఒకటి ఎంచుకోవాలని చెబితే.. తన మొదటి సెంచరీనే ఎంచుకుంటానని తెలిపాడు. దేశం కోసం చేసిన మొదటి సెంచరీ ఎప్పుడు ప్రత్యేకమేనన్నాడు. ఇంకా మంచి ఇన్నింగ్స్‌లు ఆడతానని అన్నాడు. ఉత్తమ టీ20 క్రికెట్ ప్లేయర్‌గా ఎంపిక చేసినందుకు ఐసీసీకి ధన్యవాదాలు తెలిపాడు.


Also Read:  IND Vs NZ: శార్దూల్ ఠాకూర్‌పై రోహిత్ శర్మ సీరియస్.. బంతి ఇలానే వేసేదంటూ.. 


Also Read: Pawan Kalyan: పవన్ పర్యటనలో 108 అంబులెన్స్ సైరన్.. వెంటనే వాహనాలు నిలిపివేసి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి