India Series clean sweep with 3-0 vs West Indies: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ 17 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్ధేశించిన 185 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి ఓడిపోయింది. స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ (61; 47 బంతుల్లో 8x4, 1x 6) హాఫ్ సెంచరీ చేశాడు. రొమారియో షెపర్డ్ (29), రోవ్‌మ‌న్ పావెల్ (25)లు తప్ప మిగతావారు విఫలమయ్యారు. భారత పేసర్ హర్షల్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో మూడు టీ20 సిరీస్‌ను కూడా భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ పర్యటనలో విండీస్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

185 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన విండీస్ జట్టు తొలి ఓవ‌ర్ నుంచే త‌డ‌బ‌డింది. ఓపెనర్లు కైల్ మ‌యేర్స్ (6), షై హోప్ (8) త‌క్కువ ప‌రుగుల‌కే ఔట‌య్యారు. ఈ ఇద్దరినీ దీపక్ చహర్ ఔట్ చేశాడు. ఈ సమయంలో నికోల‌స్ పూర‌న్, రోవ్‌మ‌న్ పావెల్ జట్టును ఆదుకున్నారు. అయితే హర్షల్ పటేల్, వెంకటేష్ అయ్యర్ దెబ్బకు పావెల్ సహా కీర‌న్ పోలార్డ్ (5), జేస‌న్ హోల్డ‌ర్ (2) , రోస్ట‌న్ ఛేజ్ (12) పరుగులు చేయలేకపోయారు. పూరన్ అనంతరం రొమారియా షెఫ‌ర్డ్ (29) పరుగులు చేసినా అది సరిపోలేదు. నిర్ణీత 20 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 9 వికెట్ల న‌ష్టానికి విండీస్ 167 ప‌రుగులు చేసింది. 


తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. మూడో ఓవర్‌లో ఓపెనర్ రుతురాజ్‌ గైక్వాడ్ (4) ఔట్ అయ్యాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్‌ (25), ఇషాన్‌ కిషన్ (34) దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగెత్తించారు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు పెవిలియన్ చేరారు. ఈ సమయంలో కెప్టెన్ రోహిత్‌ శర్మ (7) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఇన్నింగ్స్ చివరలో సూర్యకుమార్ యాదవ్‌ (65), వెంకటేశ్ అయ్యర్‌ (35) చెలరేగి ఆడారు. సూర్య, వెంకీ ధాటికి భారత్ చివరి ఐదు ఓవర్లలో 86 పరుగులు చేసింది.



తాజా విజయంతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో కైవసం చేసుకుంది. అంతకుముందు వన్డే సిరీస్‌ను కూడా రోహిత్ సేన 3-0తో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. పాపం విండీస్.. వన్డే, టీ20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. మూడు మ్యాచులో పరుగుల వరద పారించిన సూర్యకుమార్ యాదవ్‌ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు గెలుచుకున్నాడు. అంతేకాదు చివరిలో మ్యాచులో హాఫ్ సెంచరీ బాదడంతో  'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' కూడా లభించింది. 


Also Read: Samantha Best Friend: నువ్వు లేని ఈ జీవితంను అస్సలు ఊహించలేను.. ఫోటో షేర్ చేసిన సమంత!!


Also Read: Saha journalist: ఇదేనా జర్నలిజం అంటే.. చెంచాగిరి చేయడం ఆపండి! ఫైర్ అవుతున్న హర్భజన్, సెహ్వాగ్!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook