Suryakumar Yadav: న్యూజిలాండ్‌పై చితకబాదిన సూర్యకుమార్ యాదవ్.. రోహిత్ శర్మ రికార్డు సమం
IND Vs NZ Highlights: సూర్యకుమార్ యాదవ్ మరోసారి చెలరేగిపోయాడు. న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 111 రన్స్‌తో అజేయంగా నిలిచాడు.
IND Vs NZ Highlights: న్యూజిలాండ్ టూర్‌లో టీమిండియా శుభారంభం చేసింది. రెండో టీ20 మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ 111 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడడంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అనంతరం కివీస్ 18.5 ఓవర్లలో 126 రన్స్‌కే ఆలౌట్ అయింది. దీపక్ హుడా నాలుగు వికెట్లతో చెలరేగాడు.
టాస్ గెలిచిన కేన్ విలియమ్సన్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్.. ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. అతను క్రీజ్‌లో వచ్చే సమయానికి జట్టు స్కోరు 36 పరుగులు ఉండగా.. ఇన్నింగ్స్ ముగిసేసరికి 191 పరుగులు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు అతని తుఫాను ఇన్నింగ్స్ ఏ స్థాయిలో సాగిందో. సూర్యకుమార్ 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 111 రన్స్‌తో అజేయంగా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో అజేయ సెంచరీతో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రికార్డును సూర్యకుమార్ యాదవ్ సమానం చేశాడు. లాకీ ఫెర్గూసన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఫోర్ కొట్టి తన వ్యక్తిగత స్కోరును వంద పరుగులు చేశాడు. ఈ ఓవర్‌లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో మొత్తం 22 పరుగులు పిండుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో టీ20 ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లో రెండు సెంచరీలు చేసిన రెండో భారతీయ బ్యాట్స్‌మెన్‌గా సూర్యకుమార్ నిలిచాడు. 2018లో రోహిత్ ఈ రికార్డు సృష్టించాడు.
ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఓపెనర్‌గా రిషబ్ పంత్‌కు అవకాశం ఇచ్చాడు. అయితే ఈ ప్రయోగం మళ్లీ విఫలమైంది. పంత్ 13 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ సాయంతో 6 పరుగులు మాత్రమే చేశాడు. శ్రేయాస్ అయ్యర్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెరో 13 పరుగులు మాత్రమే చేశారు. దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్‌ల ఖాతా కూడా తెరవలేదు. బౌలింగ్‌లో మాత్రం హుడా ఆకట్టుకున్నాడు. కేవలం 10 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. సూర్యకుమార్ యాదవ్‌కు మ్యాన్‌ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
Also Read: Naga Shaurya: అనూష శెట్టిని వివాహమాడిన నాగశౌర్య.. రాచరికపు స్టైల్ లో విందు భోజనం!
Also Read: AP Rains: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook