Naga Shaurya: అనూష శెట్టిని వివాహమాడిన నాగశౌర్య.. రాచరికపు స్టైల్ లో విందు భోజనం!

Naga Shaurya tied Knot to Anusha Shetty: ముందుగా ప్రకటించిన విధంగానే నాగ శౌర్య అనూష శెట్టి అనే యువతిని వివాహమాడాడు, దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 20, 2022, 02:22 PM IST
Naga Shaurya: అనూష శెట్టిని వివాహమాడిన నాగశౌర్య.. రాచరికపు స్టైల్ లో విందు భోజనం!

Naga Shaurya tied Knot to Anusha Shetty at Banglore: ఎట్టకేలకు తెలుగు హీరో నాగశౌర్య మూడుముళ్ల బంధంతో వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు.  నాగశౌర్య తాను ప్రేమించిన అనూష శెట్టి అని యువతిని ఈరోజు మధ్యాహ్నం 11:25 నిమిషాలకు వివాహమాడాడు. తెలుగులో ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య ఆ తర్వాత తెలుగులో అనేక సినిమాల్లో హీరోగా నటించిన వ్రింద విహారి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

కొద్ది రోజుల క్రితమే తాను అనూష శెట్టి అనే యువతిని ప్రేమించి పెళ్లాడుతున్నాననే విషయాన్ని నాగశౌర్య తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించారు. అలా ప్రకటించిన విధంగానే ఆయన ఈ రోజు ఉదయం 11 గంటల 25 నిమిషాలకు బెంగళూరులోని జె డబ్ల్యూ మారియట్ అనే ఒక ఫైవ్ స్టార్ హోటల్లో వివాహం చేసుకున్నాడు. ఇక వీరిద్దరి వివాహానికి సంబంధించిన మెహందీ, హాల్ది అలాగే కాక్ టైల్ పార్టీలు కూడా నిన్న ఘనంగా జరిగాయి.

దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక వీరి పెళ్లి తర్వాత విందు రాయల్ వెడ్డింగ్ కి జరిగినట్టుగా జరిగినట్లు తెలుస్తోంది. వెండి కంచాలలో అతిరథ మహారధులకు భోజనాలు వడ్డించినట్లు చెబుతున్నారు. ఇక ఈ వివాహానికి టాలీవుడ్ నుంచి పెద్దగా ఎవరూ హాజరు కాలేదు. వాస్తవానికి కరోనా హడావిడి తర్వాత టాలీవుడ్ లో జరుగుతున్న మొట్టమొదటి పెద్ద శుభకార్యం కావడంతో గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటారని అనుకున్నారు కానీ ఎందుకో నాగశౌర్య తన కుటుంబ సభ్యులు అలాగే అమ్మాయి తరపు కుటుంబ సభ్యులతో మాత్రమే ఈ పని పూర్తి చేశారు.

ఇక టాలీవుడ్ ప్రముఖుల కోసం ఒక రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించిన అధికారిక సమాచారం మాత్రం వెలువడాల్సి ఉంది. ఇక నాగశౌర్య రేపు పెళ్లి చేసుకున్న అనూష శెట్టి కర్ణాటకలోని కుందాపుర అనే గ్రామానికి చెందిన యువతీ. అయితే ఆమె బెంగళూరులో స్థిరపడి ఇంటీరియర్ డిజైనర్ గా వర్క్ చేస్తుంది, వాటిపై మీరు కూడా ఒక లుక్ వేయండి మరి.

Also Read: Rajamouli : ఆ సినిమా తరహాలోనే మహేష్ బాబుతో మూవీ..అసలు విషయం బయటపెట్టిన జక్కన్న!

Also Read: NTR fans : ఇంకా లేట్ అవనున్న కొరటాల సినిమా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x