Suryakumar Yadav Record: భారత్, న్యూజిలాండ్ మూడో టీ20.. అరుదైన రికార్డుపై కన్నేసిన సూర్యకుమార్ యాదవ్!
Ish Sodhi Eye on Rare Record in IND vs NZ 3rd T20. కివీస్ స్పిన్నర్ ఇష్ సోధీకి టీమిండియాపై మంచి రికార్డు ఉంది. భారత్‌పై సోధీ ఇప్పటివరకు19 మ్యాచులు ఆడి 26 వికెట్లు పడగొట్టాడు.
Suryakumar Yadav Eye on KL Rahul T20I Record in IND vs NZ 3rd T20: సొంతగడ్డపై మరోసారి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ చూస్తోంది. న్యూజిలాండ్‌తో నేడు జరిగే చివరిదైన మూడో టీ20లో గెలిచి 2-0తో పొట్టి సిరీస్ సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు వన్డే సిరీస్‌ను కోల్పోయినా టీ20ల్లో గట్టి పోటీ ఇస్తోన్న కివీస్.. కనీసం పొట్టి సిరీస్‌నైనా చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. అహ్మదాబాద్‌లో బుధవారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.
మూడో టీ20లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డుపై కన్నేశాడు. సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో సూర్య 63 పరుగులు చేస్తే.. న్యూజిల్యాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో రెండో స్థానానికి చేరతాడు. న్యూజిల్యాండ్‌పై స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇప్పటివరకు 322 రన్స్ చేశాడు. కివీస్‌పై సూర్య ఇప్పటివరకు 260 పరుగులు చేశాడు. మరో 63 రన్స్ చేస్తే రాహుల్ రికార్డును బద్దలు కొడతాడు. ఈ జాబితాలో కెప్టెన్ రోహిత్ శర్మ (511) తొలి స్థానంలో ఉన్నాడు.
ప్రపంచ క్రికెట్‌లో బలమైన జట్లలో ఒకటైన న్యూజిల్యాండ్.. భారత గడ్డపై ఇప్పటివరకు ఒక్క ద్వైపాక్షిక సిరీస్ నెగ్గలేదు. 2012లో ఏకైక టీ20 మినహా (ఈ సిరీస్‌లో ఒకే ఒక్క మ్యాచ్ జరిగింది).. భారత్‌లో ఏ ఫార్మాట్లో కూడా కివీస్ ఇప్పటివరకు సిరీస్ నెగ్గలేదు. భారత గడ్డపై సిరీస్ గెలిచే అవకాశం కివీస్ జట్టుకు ఇప్పుడు వచ్చింది. మూడో టీ20లో న్యూజిల్యాండ్ గెలిస్తే.. భారత గడ్డపై రెండు లేదా అంతకన్నా ఎక్కువ మ్యాచులు ఉన్న సిరీస్‌ను తొలిసారి ఖాతాలో వేసుకుంటుంది.
కివీస్ స్పిన్నర్ ఇష్ సోధీకి టీమిండియాపై మంచి రికార్డు ఉంది. భారత్‌పై సోధీ ఇప్పటివరకు19 మ్యాచులు ఆడి 26 వికెట్లు పడగొట్టాడు. మూడో టీ20లో ఒక్క వికెట్ తీస్తే.. ప్రత్యర్థిపై అత్యధిక టీ20 వికెట్లు తీసుకున్న రెండో బౌలర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (ఐర్లాండ్‌పై 37 వికెట్లు) తొలి స్థానంలో ఉన్నాడు.
Also Read: Budget 2023-24: మహిళలకు కొత్త స్కీమ్.. వృద్ధులకు శుభవార్త! బడ్జెట్‌లో మొదటిసారి ఓ కొత్త ప్యాకేజీ
Also Read: Budget 2023-24 Price Hike: కేంద్ర బడ్జెట్ 2023.. ధరలు తగ్గే, పెరిగే వస్తువులు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.