ICC Rankings 2024 Updates: టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 861 పాయింట్లతో సూర్య నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. అతడి తర్వాత స్థానాల్లో ఫిల్‌ సాల్ట్‌, రిజ్వాన్‌, ఆజమ్‌ ఉన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20లో మ్యాచ్ సందర్భంగా మిస్టర్ 360 గాయపడ్డాడు. వైద్యులు అతడికి స్పోర్ట్స్ హెర్నియా ఉన్నట్లు తేల్చి.. సర్జరీ చేశారు. ప్రస్తుతం అతడు ఫిటినెస్ నిరూపించుకునే పనిలో ఉన్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్  తిరిగి టాప్‌-10లోకి దూసుకొచ్చాడు. 645 పాయింట్లు సాధించి నాలుగు స్థానాలు ఎగబాకి తొమ్మిదవ స్థానానికి చేరుకున్నాడు. బంగ్లాదేశ్ వెటరన్ షకీబ్ అల్ హసన్ టీ20 ఆల్-రౌండర్‌ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. 


టాప్-5లో నలుగురు మనోళ్లే..
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్ల జోరు కొనసాగుతోంది. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం ఎప్పటిలాగే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 824 పాయింట్లతో అతడు నంబర్ వన్ గా ఉన్నాడు. 801 రేటింగ్‌ పాయింట్లతో శుభ్ మన్ గిల్ రెండో స్థానంలో ఉన్నాడు. 768 రేటింగ్‌ పాయింట్లతో కోహ్లీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. 
గతంలో ఐదో స్థానంలో ఉన్న రోహిత్ ఒక స్థానం మెరుగుపరచుకుని నాలుగో స్థానానికి చేరాడు. ఐర్లాండ్ క్రికెటర్ హ్యారీ టెక్టర్ పేలవ ప్రదర్శన హిట్ మ్యాన్ కు కలిసొచ్చింది. హ్యారీ ఐదో స్థానానికి దిగజారాడు. కివీస్ ప్లేయర్ డారిల్ మిచెల్ 728 పాయింట్లతో ఆరో స్థానంలోనూ, 723 రేటింగ్‌తో డేవిడ్ వార్నర్ ఏడో స్థానంలోనూ కొనసాగుతున్నారు. మరోవైపు శ్రీలంక ప్లేయర్ పాతుమ్ నిస్సాంక మూడు స్థానాలు ఎగబాకి ఇప్పుడు టాప్ 10లోకి దూసుకొచ్చాడు. అతడు ఎనిమిదో స్థానంలో ఉండగా.. డేవిడ్‌ మలన్‌, వాన్ డెర్ డస్సెన్ తొమ్మిది, పదో స్థానాల్లో ఉన్నారు. 


Also Read: Water Crisis: ఐపీఎల్ మ్యాచ్‌లను వెంటాడుతున్న నీటి కష్టాలు.. అక్కడి మ్యాచులకు శుద్ధి చేసిన నీరు..


Also  Read: IPL 2024: ఐపీఎల్ వేటకు సిద్ధం.. సొంత జట్లకు తిరిగి వచ్చిన ఆటగాళ్లు వీళ్లే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook