Syed Mushtaq Ali Trophy: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(Syed Mushtaq Ali Trophy)లో విదర్భ స్పిన్నర్ అక్షయ్ కర్నేవార్(Akshay Karnewar) తన బౌలింగ్ తో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో.. అతను తన కోటాలో మొత్తం నలుగురు మెయిడిన్‌(four maiden overs)లను వేశాడు. ఈ నాలుగు ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. అలాగే రెండు వికెట్లు కూడా తీశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండు చేతులతో బౌలింగ్ చేసిన అక్షయ్.. టీ20 క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా నిలిచాడు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్, ఫ్రాంచైజీ టీ20లతో సహా ఏ బౌలర్ కూడా తన కోటాలో మొత్తం నాలుగు ఓవర్లలో మెయిడిన్లు వేయలేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అక్షయ్ జట్టు విదర్భ(Vidarbha Team) తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 222 పరుగుల భారీ స్కోరు చేసింది. జితేష్ శర్మ అజేయంగా 71, అపూర్వ వాంఖడే 49 పరుగులు చేశారు. అనంతరం మణిపూర్(Manipur) జట్టు 16.3 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. దీంతో విదర్భ 167 పరుగుల తేడాతో విజయం సాధించింది.



Also Read: Rohit Sharma as T20I Captain: టీమిండియా T20I కేప్టేన్‌గా రోహిత్ శర్మను నియమించిన BCCI


వెంకటేష్ అయ్యర్ అద్బుత బౌలింగ్
మధ్యప్రదేశ్ యువ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్(Venkatesh Iyer) కూడా బీహార్‌తో జరిగిన మ్యాచ్‌లో చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. అతను 2 పరుగులిచ్చి 4 ఓవర్లలో 2 మెయిడిన్లు వేసి 2 వికెట్లు తీశాడు. ఐపీఎల్ ఫేజ్-2లో అద్భుత ప్రదర్శన చేసిన వెంకటేష్ అయ్యర్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు భారత జట్టులోకి ఎంపికయ్యాడు. న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్ నుంచి రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) పూర్తి స్థాయి కోచ్‌గా కెరీర్‌ను ప్రారంభించనున్నాడు. రోహిత్ శర్మ(Rohith Sharma)ను కెప్టెన్‌గా అయిన సంగతి తెలిసిందే.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook