ఫైనల్ లో బెర్తు కోసం టీమిండియా, బంగ్లాదేశ్ పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే తొలి  రెండు టి 20 మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా ఈ రోజు బంగ్లాతో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే సమీకరణాలతో సంబంధం లేకుండా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో టోర్నీ ఫైనల్ చేరుతుంది. ఒక వేళ ఓటమి పాలైతే నెట్ రన్ రేట్ ఆధారంగా కోహ్లీసేన ఫైనల్ చేరుకునే అవకాశముంది. ఫైనల్ కు ఆత్మవిశ్వాసంతో వెళ్లాలంటే ఈ మ్యాచ్ లో విజయం సాధించడం తప్పిసరిగా మారింది. దీంతో ప్రయోగాలకు వెళ్లకుండా గత మ్యాచ్ లో ఆడిన జట్టునే  బరిలో దించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆత్మవిశ్వాం ఉన్న బంగ్లాకు భారత్ భయం


ఇటు బంగ్లాదేశ్ జట్టు పరిస్థితి భిన్నం. ఆ జట్టు ఆడిన రెండు లీగ్ లలో ఒక దానిలో విజయం సాధించగా..మరొకదానిలో చేతులెత్తేసింది. దీంతో ఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్ లో తప్పని సరిగా గెలవాల్సి ఉంది. దీంతో బంగ్లా కూడా ఈ మ్యాచ్ కోసం అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంది. వాస్తవానికి ఈ రోజు జరిగే మ్యాచ్ లో బంగ్లా ఒక వేళ ఓటమి పాలైతే .. శ్రీలంకతో జరిగే తదుపరి మ్యాచ్ కీలకంగా మారుతంది. పీకలమీద వరకు తెచ్చుకునేకంటే ముందున్న అవకాశంపై దృష్టి సారింది. బంగ్లాకు కావాల్సినంత ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ కోహ్లీసేన భయం ఆ జట్టులో కనిపిస్తూనే ఉంది.  


ఒక వేళ బంగ్లా విజయం సాధిస్తే..
ఈ రోజు జరిగే మ్యాచ్ లో బంగ్లా జట్టు విజయం సాధించి.. తదుపరి శ్రీలంక చేతిలో ఓడితే పరిస్థితి మరో రకంగా ఉంటుంది. టోర్నీలోని జట్లన్నీ నాలుగేసి పాయింట్లతో రన్ రేట్ ఆధారంగా ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంటాయి. నెట్ రన్ రేట్ ఆధారంగా చూస్తే భారత్ పరిస్థితి మెరుగ్గా ఉంది. కాబట్టి ఫైనల్ బెర్త్ విషయంలో భారత్ కు డోకా లేదు. బంగ్లా, శ్రీలంకల మధ్య అప్పుడు పోటీ ఏర్పడుతుంది. ఏది ఏమైనా ఈ విజయం సాధించడం రెండు జట్లకు చాలా అవసరం మారింది.