Michael Vaughan predicts semi-finalists for T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ కు ఇంకా నెలరోజుల మాత్రమే సమయం ఉంది. ఈ మెగా టోర్నీ జూన్ 01 నుండి అమెరికా, వెస్టిండీస్ వేదికగా ప్రారంభంకానుంది. అయితే ఆయా టీమ్స్ జట్టును ప్రకటించడానికి ఈరోజే చివరి రోజు. మంగళవారం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ సందర్భంగా మరోసారి భారత్ పై తన అక్కసును వెళ్లగక్కాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్. టీ20 ప్రపంచకప్ 2024లో సెమీ-ఫైనల్‌కు వెళ్లే జట్లు ఇవేనంటూ జోస్యం చెప్పాడు. ఆ లిస్ట్ లో భారత్ జట్టు లేకపోవడం క్రికెట్ ఫ్యాన్స్ కంగుతిన్నారు. సోషల్ మీడియా వేదికగా అతడిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెమీస్ కు వెళ్లే నాలుగు జట్లు..


సెమీస్ వెళ్లే జట్లుగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మరియు వెస్టిండీస్‌లను ఎంచుకున్నాడు వాన్. దీంతో ఆగ్రహం చెందిన టీమిండియా ఫ్యాన్స్ వాన్ ను తిడుతూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మరియు వెస్టిండీస్ అన్నీ సూపర్ 8కి అర్హత సాధిస్తే.. వారు ఒకే గ్రూప్‌లో ఉంటారు కాబట్టి ఇది అసాధ్యమని ఒక అభిమాని రాసుకొచ్చాడు. 


https://twitter.com/MichaelVaughan/status/1785567519148761347?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1785567519148761347%7Ctwgr%5Ec779aa4357fa6091554b084815c65dbc368fa060%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.india.com%2Fhindi-news%2Fcricket-hindi%2Fmichael-vaughan-predicts-rohit-sharma-led-team-india-will-not-maket20-world-cup-2024-semis-6897685%2F


టీ20 ప్రపంచకప్ 2024 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును మంగళవారం నాడు బీసీసీఐ ప్రకటించింది. ఈ టోర్నీకి కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఎంపికయ్యారు. ఈ మెగా టోర్నీకి కేఎల్ రాహుల్ ను పక్కన పెట్టి.. సంజూ శాంసన్, రిషబ్ పంత్‌లు జట్టులోకి తీసుకున్నారు. పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా మరియు ఆమెరికాతో కలిసి టీమిండియా గ్రూప్-ఏలో ఉంది. న్యూ యార్క్‌లోని కొత్తగా నిర్మించిన నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జూన్ 5న ఐర్లాండ్‌తో టీమ్ ఇండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. దీని తర్వాత అదే వేదికగా జూన్ 9న పాకిస్థాన్‌తో, జూన్ 12న అమెరికాతో, జూన్ 15న కెనడాతో తలపడనుంది.


టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టు ఇదే..
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా వైస్‌ కెప్టెన్‌, జైస్వాల్‌, వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, సంజూ శాంసన్‌, శివమ్‌ దుబే, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, చాహల్‌, అర్ష్‌దీప్‌, బుమ్రా, సిరాజ్‌. 
రిజర్వ్‌ ఆటగాళ్లు: శుభ్‌మన్‌ గిల్‌, రింకూ సింగ్‌, ఖలీల్‌ అహ్మద్‌, అవేశ్‌ ఖాన్‌.


Also Read: IPL 2024 Updates: 'ఈ ఐపీఎల్ సీజన్ లో ఆ రెండు జట్లతోనే మాకు పోటీ'..: కమిన్స్


Also Read: Team India Squad: టీ20 ప్రపంచకప్ కు 15 మందితో టీమ్ ఇండియా సిద్ధం, ఎవరి బలమెంత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter