Irfan Pathan: టీ20 వరల్డ్‌కప్‌లో రోహిత్ కు జోడి అతడే.. గిల్ కాదు..!
T20 WC 2024: జూన్ 01 నుండి టీ20 వరల్డ్ కప్ మెుదలుకానుంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల జట్లన్నీ ఆటగాళ్లను ఎంపిక చేసే పనిలో ఉన్నాయి. తాజాగా టీమిండియా టాప్-3 ఆటగాళ్లను ఎంచుకున్నాడు ఇర్ఫాన్ పఠాన్. వారెవరంటే?
India's T20 World Cup Squad: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ 17 క్రికెట్ ప్రేమికులను ఊర్రూతలూగిస్తోంది. ఈ మెగా టోర్నీ ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. జూన్ 01 నుండి వెస్టిండీస్, అమెరికా వేదికగా ఈ టోర్నీ మెుదలు కానుంది. అయితే ఈ మహా సంగ్రామానికి నెలరోజులకు పైగా సమయం ఉన్నప్పటికీ.. ఐపీసీ రూల్స్ ప్రకారం, మే01లోపు జట్లన్నీ తమ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రపంచకప్ లో పాల్గొనే జట్లన్నీ ఆటగాళ్లను ఖరారు చేసే పనిలో పడ్డాయి. బీసీసీఐ కూడా భారత జట్టును ఏప్రిల్ 28న ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ త్వరలో జట్టుకు సంబంధించిన వివరాలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
పఠాన్ ఎంపిక చేసిన టాప్-3 వీరే..
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపికయ్యే జట్టులో టాప్-3 ఆటగాళ్లును ఎంచుకున్నాడు. టీమిండియా ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఆటగాడు యశస్వీ జైశ్వాల్ ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఫస్ట్ డౌన్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని ఎంపిక చేశాడు. స్ట్రైక్ రేట్ పరంగా క్రిస్ గేల్ కంటే కోహ్లినే మెరుగ్గా ఉన్నాడని అతడు కచ్చితంగా జట్టులో ఉంటాడని పఠాన్ అభిప్రాయపడ్డాడు. అయితే ఇతడి లిస్ట్ లో శుభమాన్ గిల్ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఫామ్ లోకి యశస్వి..
సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ అద్భుతంగా ఆడాడు. కేవలం 60 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 104 పరుగులు చేసి జట్టను గెలిపించాడు యశస్వి. ముంబైతో మ్యాచ్ ముందు వరకు పెద్దగా ఆడని యశస్వి.. ప్రపంచకప్ కు జట్టును ఎంపిక చేసే కీలక సమయంలో తన బ్యాట్ నుండి పరుగులు రావడం ప్రారంభించాయి. ఐపీఎల్‌లో యశస్వికి ఇది రెండో సెంచరీ. 2023లో ఐపీఎల్‌లో తొలి సెంచరీ చేశాడు.
కోహ్లీ టాప్ స్కోరర్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2024లో టాప్ స్కోరర్. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 379 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
రోహిత్ శర్మ
ఐపీఎల్ 2024లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా బాగానే ఆడాడుచెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ శతకం సాధించాడు. ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ 5వ స్థానంలో ఉన్నాడు. 8 మ్యాచ్‌ల్లో 303 పరుగులు చేశాడు.
Also Read: Pat Cummins: టాలీవుడ్ ప్రిన్స్ ను కలిసిన ప్యాట్ కమిన్స్, ఫోటోలు వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter