Afghanistan Vs Namibia: టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) రెండో విజయాన్ని నమోదు చేసింది అఫ్గానిస్థాన్‌ జట్టు. దీంతో సెమీస్ రేసులో (T20 World Cup Semis) అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో నమీబియాపై (AFG Vs Namibia) 62 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. అఫ్గాన్‌ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 98 పరుగులు మాత్రమే చేసింది. నమీబియా బ్యాటర్లలో డేవిడ్‌ వైస్‌ (26) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అఫ్గాన్‌ బౌలర్లలో నవీన్‌ ఉల్‌ హక్‌, హమీద్‌ హసన్‌ మూడు వికెట్లతో ఆకట్టుకోగా, గుల్బాదీన్‌ నైబ్‌ రెండు, రషీద్‌ఖాన్‌ తలో వికెట్‌ తీశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లక్ష్య ఛేదనకు దిగిన నమీబియా ఆరంభం నుంచి వరుసగా వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ విలియమ్స్‌ (1), మూడో ఓవర్‌లో మరో ఓపెనర్‌ వాన్‌ లింగెన్‌ (11) ఔటయ్యారు. వీరిద్దరిని నవీన్ ఉల్‌ హక్‌ పెవిలియన్‌కి చేర్చాడు. గుల్బాదీన్‌ వేసిన ఆరో ఓవర్లో లాప్టి ఎటాన్‌ (14) క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు. కుదురుకున్నట్టు కనిపించిన ఎరాస్‌మస్‌ (12)ని 11 ఓవర్‌లో హమీద్‌ వెనక్కి పంపాడు. అదే ఓవర్‌లో చివరి బంతికి జే జే స్మిత్‌ (0) కూడా ఔటయ్యాడు. దీంతో నమీబియా మరింత కష్టాల్లో పడింది. ఫ్రైలింక్‌ (6), ఫ్రాన్స్‌ (3) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. 17 ఓవర్‌లో డేవిడ్ వైస్‌ ఔటయ్యాడు. ట్రంపుల్మన్‌ (12), బెర్నాడ్ (6) నాటౌట్‌గా నిలిచారు.


తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 160 పరుగులు (Afghanistan Live Score) చేసింది. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్‌ (33), మహమ్మద్‌ షంజాద్‌ (45) శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు అర్ధశతకం (53) భాగస్వామ్యం నిర్మించారు. పవర్‌ప్లేలో ధాటిగా ఆడిన అఫ్గాన్‌ను నమీబియా బౌలర్లు అడ్డుకున్నారు. స్వల్ప వ్యవధిలో ఓపెనర్లతోపాటు రహమాన్‌తుల్లా (4), జాద్రాన్‌ (7)ను ఔట్‌ చేసి కాస్త పట్టు సాధించారు. అయితే అస్గర్ అఫ్గాన్‌ (31), కెప్టెన్ మహమ్మద్‌ నబీ (32*) ఆఖర్లో దూకుడుగా బ్యాటింగ్‌ చేశారు. నమీబియా బౌలర్లలో రుబెన్ ట్రంపుల్మన్‌ 2, జాన్‌ నికోల్ 2.. స్మిత్ ఒక వికెట్‌ తీశారు.


Also Read: India Vs New Zealand: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. భారత్ బ్యాటింగ్


Also Read: Neeraj Chopra New Car: నీరజ్ చోప్రా కోసం ప్రత్యేకంగా ‘జావెలిన్ గోల్డ్’ ఎడిషన్ XUV 700 కారు  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook