Australia team for T20 World Cup 2021: టీ 20 ప్రపంచ కప్ టోర్నమెంట్ కోసం ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. ముగ్గురు ట్రావెలింగ్ రిజర్వ్స్ ఆటగాళ్లతో కలిపి టి20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనబోయే మొత్తం 15 మంది ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది. వెస్టిండీస్, బంగ్లాదేశ్‌ పర్యటనలకు దూరమైన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్ వెల్ లాంటి స్టార్ క్రికెటర్స్ తిరిగి వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విచిత్రం ఏంటంటే అలెక్స్ కేరీ (Alex Carey) లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడిని పక్కనపెట్టి క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు జోష్ ఇంగ్లిస్‌ని ఎంపిక చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టీ20 సిరీస్‌లో జోష్ అద్భుతంగా రానించడమే అందుకు కారణమై ఉండొచ్చని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. 


ఆస్ట్రేలియా క్రికెటర్లలో టీ20 స్పెషలిస్టులుగా పేరున్న మార్కస్ స్టొయినిస్, కేన్ రిచర్డ్‌సన్ కూడా టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించుకున్నారు. యూఏఈ, ఒమన్‌లో జరగనున్న ఈ వరల్డ్ కప్ టోర్నీ అక్టోబర్ 17న ప్రారంభమై నవంబర్ 14న (T20 World Cup 2021 schedule) ముగియనుంది.  


Also read : Mohammad Siraj Record: లార్డ్స్ టెస్ట్‌లో 39 ఏళ్ల రికార్డు సమం చేసిన టీమ్ ఇండియా పేసర్ సిరాజ్


వన్డే ఇంటర్నేషనల్స్ ఫార్మాట్‌లో ఐసిసి మెన్స్ వరల్డ్ కప్ టోర్నమెంట్స్‌లో సక్సెస్‌ఫుల్ టీమ్ అనిపించుకున్న ఆస్ట్రేలియా 2007లో టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ప్రపంచ కప్ కూడా గెల్చుకోలేదు. 


T20 World Cup 2021 Australia team - ఆస్ట్రేలియా టీ 20 ప్రపంచ కప్ 2021 జట్టు: 
ఆరోన్ ఫించ్ (కెప్టేన్), అష్టన్ అగర్, పాట్ కమిన్స్ (Pat cummins), జోష్ హాజెల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, కేన్ రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్వీప్సన్, మాథ్యూ వేడ్ , డేవిడ్ వార్నర్, ఆడమ్ జాంపా. ట్రావెలింగ్ రిజర్వ్స్ ఆటగాళ్ల జాబితాలో డాన్ క్రిస్టియన్, నాథన్ ఎల్లిస్, డేనియల్ సామ్స్ ఉన్నారు.


Also read : T20 World Cup: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. పాక్ తో భారత్ మ్యాచ్ ఎప్పుడంటే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook