T20 World Cup 2021: ICC T20 World Cup 2021 ముగిసింది. ఆస్ట్రేలియా తొలిసారిగా టైటిల్ సాధించింది. అటు ఆస్ట్రేలియన్ క్రికెటర్లు మిచెల్, వార్నర్ భాయ్‌లు కొత్త రికార్డు సృష్టించారు. అదేంటో చూద్దాం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూఏఈ వేదికగా అత్యంత ఆసక్తిగా జరిగిన T20 World Cup 2021 ముగిసింది. కొత్త ఛాంపియన్‌గా తొలిసారి టీ20 ప్రపంచకప్ 2021 (T20World Cup 2021) కంగారూలు కైవసం చేసుకున్నారు. ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ దేశాల మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ 2021 ఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టుపై ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలిసారిగా టీ20 ఫార్మట్ క్రికెట్‌లో ప్రపంచకప్ సాధించింది. అద్బుతంగా రాణించి టైటిల్ గెల్చుకోవడంలో కీలకపాత్ర పోషించిన డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్‌లతో పాటు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌లు అరుదైన రికార్డు కూడా సొంతం చేసుకున్నారు. 


ఇక నవంబరు 14 నాటి ప్రపంచకప్‌ ఫైనల్‌ సందర్భంగా న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(Kane Williamson), ఆసీస్‌ ఆటగాళ్లు మిచెల్‌ మార్ష్‌, డేవిడ్‌ వార్నర్‌(David Warner)అరుదైన ఘనత సాధించారు. టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో తక్కువ బంతుల్లో అర్ధ శతకం సాధించిన క్రికెటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. మార్ష్‌ 31 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగా..విలియమ్సన్‌ 32 బంతులు, వార్నర్‌ 34 బంతుల్లో ఈ రికార్డు సాధించారు. అంతకుముందు 2014లో ఇండియాతో ఫైనల్‌లో శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర 33 బంతుల్లో, 2016లో వెస్టిండీస్‌తో ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ బ్యాటర్‌ జో రూట్‌ 33 బంతుల్లో ఈ ఘనత అందుకున్నారు. 


Also read: T20 World Cup 2021*: వరల్డ్ చాంపియన్స్ గా ఆస్ట్రేలియా*..8 వికెట్ల తేడాతో NZ పై గెలుపు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook