T20 WC 2021 IND Vs PAK:  టీ20 ప్రపంచకప్(​T20 World Cup 2021)లో భాగంగా..దాయాదుల పోరు రసవత్తరంగా సాగింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో పాకిస్థాన్(Pakistan)నే విజయం వరించింది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ పాక్ ఓపెనర్లు ఏ మాత్రం తడబడకుండా ఆడి..తమ జట్టుకు గెలుపును కట్టబెట్టారు. 152 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాక్ ఓపెనర్లు నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. భారత్ బౌలర్లును దీటుగా ఎదుర్కొంటూ...కెప్టెన్ బాబర్ అజామ్(52 బంతుల్లో 68: 6 ఫోర్లు, 2సిక్సర్లు), రిజ్వాన్(55 బంతుల్లో 79: 6 ఫోర్లు, 3సిక్సర్లు) రాణించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాణించిన కోహ్లీ..దెబ్బతీసిన ఆఫ్రిది


టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా(Teamindia)కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్లలోనే రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. కాసేపటికే రాహుల్ మూడు పరుగులు చేసి క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. వీరిద్దరి వికెట్లను షహీన్ ఆఫ్రిది(Shaheen Afridi)తీశాడు. అనంతరం సూర్యకుమార్ యాదవ్ తో జత కలసిన కెప్టెన్ కోహ్లీ ఆచితూచి ఆడాడు. ఐదో ఓవర్లో సూర్య కుమార్ కేవలం 11 పరుగులే చేసి క్యాచ్ ఔటయ్యాడు. 


Also Read: IND vs PAK: భారత్- పాక్‌ మ్యాచ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా బాలీవుడ్ బ్యూటీ


అనంతరం కోహ్లీ(Kohli)తో జతకట్టిన పంత్ స్కోరు బోర్డును పరుగులెట్టించాడు. పంత్(Pant) హసన్ అలీ బౌలింగ్ లో రెండు సిక్సర్లు కొట్టి..మాంచి ఊపు మీద కనిపించాడు. కానీ భారీ షాట్‌కు యత్నించిన రిషభ్‌ (30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔటయ్యాడు. షాదాబ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అతనికే క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 84 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. 


ఓ పక్క వికెట్లు కోల్పోతున్న కెప్టెన్ కోహ్లీ తనదైన మార్క్ షాట్స్ అలరించాడు. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు. 125 పరుగుల వద్ద జడేజా కేవలం 13 పరుగలు మాత్రమే  చేసి క్యాచ్ ఔటయ్యాడు. వెంటనే కోహ్లీ(49 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్సర్) కూడా ఆఫ్రిది బౌలింగ్ లో వెనుదిరిగాడు. హార్దిక్ రెండు ఫోర్లు కొట్టి చివరి ఓవర్లో వెనుదిరిగాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి