T20 World Cup 2021: టి 20 ప్రపంచకప్ 2021లో పాకిస్తాన్ సెమీఫైనల్స్‌లో దూసుకెళ్లింది. నమీబియాపై ఘన విజయం సాధించిన పాకిస్తాన్ గ్రూప్ 2లో అగ్రస్థానంలో ఉంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ వరుస మూడవ విజయమిది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐసీసీ టీ 20 ప్రపంచకప్‌లో(T20 World Cup 2021) గ్రూప్ 1లో అగ్రస్థానంలో నిలిచిన ఇంగ్లండ్ జట్టు (England Team)ఇప్పటికే సెమీఫైనల్స్‌లో దూసుకెళ్లింది. ఇక గ్రూప్ 2 నుంచి వరుసగా మూడవ విజయంతో అగ్రస్థానంలో నిలిచిన పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. గ్రూప్ 1లో ఇంగ్లండ్ 4 మ్యాచ్‌లు ఆడి..నాలిగింట గెలిచి 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, గ్రూప్ 2 నుంచి పాకిస్తాన్ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడి మూడింట గెలిచి 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. సెమీస్‌కు చేరింది. 


నిన్న జరిగిన పాకిస్తాన్ వర్సెస్ నమీబియా(Pakistan vs Namibia) మ్యాచ్‌లో పాకిస్తాన్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 190 పరుగుల భారీ లక్ష్యాన్ని నమీబియాకు అందించింది. ఓపెనర్లు బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్ చెలరేగి ఆడారు బాబర్ ఆజమ్ 70, రిజ్వాన్ 79 పరుగులు సాధించి..తొలి వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అనంతరం లక్ష్య సాధనకు దిగిన నమీబియా జట్టు ప్రారంభంలో 78 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత 93 పరుగుల వద్ద మూడవ వికెట్ కోల్పోయింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. నమీబియా(Namibia) అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది. నమీబియా ఇప్పటి వరకూ రెండు మ్యాచ్‌లు ఆడి ఒక మ్యాచ్‌లో గెలిచింది. 2 పాయింట్లు సాధించింది. పాకిస్తాన్(Pakistan) బౌలర్లలో ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హరీస్ రవూఫ్ చెరో వికెట్ సాధించారు. నమీబియా జట్టులో విలియమ్స్ 40 పరుగులు, డేవిడ్ వైస్ 43 పరుగులు చేశారు. 


Also read: T20 World Cup 2021: విరాట్ కోహ్లీ, ఇండియా టీమ్ మేనేజ్మెంట్‌పై Sunil Gawaskar ఆగ్రహం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook