South Africa vs West Indies: టీ20 ప్రపంచకప్(​T20 World Cup 2021)లో భాగంగా..మంగళవారం జరిగిన మ్యాచ్​లో వెస్టిండీస్​ జట్టుపై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది దక్షిణాఫ్రికా(South Africa). మర్​క్రమ్(Markram) అర్ధ సెంచరీతో అదరగొట్టి సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మర్​క్రమ్ హాఫ్ సెంచరీ
మార్‌క్రమ్‌ (51; 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), డస్సెన్‌ (43; 51 బంతుల్లో 3 ఫోర్లు, ) రాణించడంతో విండీస్‌(Westindies) నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ బావుమా (2) తర్వగా పెవిలియన్ చేరినా తర్వాత వచ్చిన డస్సెన్‌.. ఓపెనర్ హెన్‌డ్రిక్స్‌(39)తో కలిసి ఇన్నింగ్స్‌ని చక్కదిద్దాడు. హొస్సెన్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో హెన్‌డ్రిక్స్‌ హెట్‌మయర్‌కి చిక్కాడు. తర్వాత మార్‌క్రమ్,  డస్సెన్‌(Dussen) నిలకడగా ఆడుతూ జట్టును గెలిపించారు.


Also read: Team India: టీమిండియా హెడ్‌కోచ్‌ నియామకానికి రాహుల్‌ ద్రవిడ్ దరఖాస్తు...NCA హెడ్ రేసులో లక్ష్మణ్!


రాణించిన లూయిస్..
తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కి దిగిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. విండీస్‌ తొలి మూడు ఓవర్లలో ఆరు పరుగులే చేసింది. నాలుగో ఓవర్‌ నుంచి గేర్ మార్చిన ఎవిన్‌ లూయిస్ ఫోర్లు సిక్సర్లతో అలరించాడు. మరో ఓపెనర్ లెండిల్‌ సిమ్మన్స్‌ (16) నెమ్మదిగా ఆడుతూ అతడికి సహకరించాడు. అర్ధ శతకం పూర్తి చేసుకున్న తర్వాత లూయిస్‌ కేశవ్‌ మహరాజ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.


ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్‌ పూరన్ (12) దూకుడుగా ఆడే క్రమంలో డేవిడ్ మిల్లర్‌కి చిక్కి క్రీజు వీడాడు. కగిసో రబాడ వేసిన 14వ ఓవర్లో సిమ్మన్స్ బౌల్డై మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. క్రిస్ గేల్ (12), షిమ్రోన్ హెట్‌మైర్‌ (1), ఆండ్రూ రస్సెల్ (5), హేడెన్‌ వాల్ష్‌ (0) విఫలమయ్యారు. ఆఖర్లో వచ్చిన పొలార్డ్‌ (26) పరుగులు చేశాడు. డ్వేన్‌ బ్రావో (8), అకీల్ హోసీన్‌ (0) నాటౌట్‌గా నిలిచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో డ్వేయిన్‌ ప్రిటోరియస్‌ మూడు, కేశవ్‌ మహరాజ్‌ రెండు, కగిసో రబాడ, అన్రిచ్‌ నోర్జే తలో వికెట్ తీశారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి