Team India: టీమిండియా హెడ్‌కోచ్‌ నియామకానికి రాహుల్‌ ద్రవిడ్ దరఖాస్తు...NCA హెడ్ రేసులో లక్ష్మణ్!

India Cricket Team: భారత మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్ మంగళవారం నాడు టీమిండియా ప్రధాన కోచ్ పదవికి అప్లై చేశాడు.ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు ధ్రువీకరించాయి.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 26, 2021, 06:28 PM IST
  • టీమిండియా ప్రధాన కోచ్‌ పదవికి ద్రవిడ్ అప్లై
  • ఎన్సీఏ హెడ్ కోచ్ రేసులో లక్ష్మణ్
  • టీ20 వరల్డ్ కప్ తర్వాత వైదొలగనున్న రవిశాస్త్రి
Team India: టీమిండియా హెడ్‌కోచ్‌ నియామకానికి రాహుల్‌ ద్రవిడ్ దరఖాస్తు...NCA హెడ్ రేసులో లక్ష్మణ్!

India Cricket Team: టీమిండియా ప్రధాన కోచ్‌ నియామకానికి భారత మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్(Rahul Dravid) దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ(BCCI) వర్గాలు ధ్రువీకరించాయి. కోచ్‌గా ద్రవిడ్ నియామకం అయితే.. జాతీయ క్రికెట్‌ అకాడమీ బాధ్యతలను టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్‌(VVS Laxman ) చేపట్టే అవకాశముందని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. 

‘రాహుల్‌ ద్రవిడ్ టీమిండియా హెడ్‌కోచ్‌ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. జాతీయ క్రికెట్ అకాడమీ బాధ్యతలను వీవీఎస్‌ లక్ష్మణ్ తీసుకునే అవకాశం ఉంది. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం’ అని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌(T20 WorldCup 2021) ముగిసిన తర్వాత హెడ్‌కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. దీంతో కొత్త కోచ్‌ కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. 

Also Read; Ind Vs Pak: ఢిల్లీతో ఇస్లామాబాద్ స్నేహపూర్వక సంబంధాలు కోరుకుంటుంది: ఇమ్రాన్ ఖాన్

బెంగళూరులో ఉన్న జాతీయ క్రికెట్ అకాడమీ(NCA) హెడ్‌గా కొనసాగుతున్న రాహుల్‌ ద్రవిడ్..ఎంతో మంది యువ క్రికెటర్లను భారత జట్టుకు అందించాడు. దీంతో ఇతడు టీమిండియా ప్రధాన కోచ్‌(Teamindia Head Coach)గా ఉంటే భారత క్రికెట్‌కు మరింత మేలు జరుగుతుందని చాలా మంది మాజీ క్రికెటర్లు ఆశిస్తున్నారు.  టీ20 ప్రపంచప్ తర్వాత విరాట్ కోహ్లీ కూడా పొట్టి ఫార్మాట్‌లో కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News