Shaheen Afridi deadly yorker sends Afghanistan opener Rahmanullah Gurbaz to hospital: పాకిస్తాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షాహిన్‌ షా అఫ్రిది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గంటకి 145-150 కిమీ వేగంతో బంతులు సంధిస్తాడు. 22 ఏళ్ల అఫ్రిది వేసే బుల్లెట్ బంతులకు ప్రత్యర్థి బ్యాటర్ల మధ్య సమాధానమే ఉండదు. అఫ్రిది యార్కర్‌లకు ఒక్కోసారి బ్యాటర్లకు గాయాలు కూడా అవుతుంటాయి. ఈ క్రమంలోనే అఫ్గానిస్తాన్‌ బ్యాటర్‌ రహమనుల్లా గుర్బాజ్‌ ఆస్పత్రి పాలయ్యాడు. టీ20 ప్రపంచకప్‌ 2022లో భాగంగా బుధవారం అప్గానిస్తాన్‌, పాకిస్తాన్‌ మధ్య జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అప్గానిస్తాన్‌, పాకిస్తాన్‌ మధ్య బుధవారం వార్మప్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచులో పాక్ పేసర్ షహీన్ షా అఫ్రిది నిప్పులు చెరిగాడు. బుల్లెట్‌ వేగంతో బంతులు వేస్తూ అప్గానిస్తాన్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో అఫ్రిది వేసిన యార్కర్‌ రహమనుల్లా గుర్బాజ్‌ కాలికి బలంగా తగిలింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన గుర్బాజ్‌.. మైదానంలోనే కుప్పకూలాడు. దాంతో ఫిజియోతో వచ్చి మసాజ్‌ చేసినా ఫలితం లేకుండా పోయింది. నడవలేని స్థితిలో ఉన్న గుర్బాజ్‌ను సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్ తన వీపుపై గుర్బాజ్‌ను ఎక్కించుకొని పెవిలియన్‌కు తీసుకెళ్లాడు.


రహమనుల్లా గుర్బాజ్‌ను వీపుపై ఎక్కించుకొని వెళుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎక్స్‌రే నిమిత్తం గుర్బాజ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. రిపోర్ట్స్‌ వచ్చాకే గాయం తీవ్రత గురించి తెలియరానుంది. ఒకవేళ గుర్బాజ్‌ గాయంతో దూరమైతే.. ఆఫ్గనిస్తాన్‌కు పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పొచ్చు. ఇక వీడియో చూసిన నెటిజన్లు 'టీమిండియాకు డేంజర్ బెల్స్' అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం పాపం రహమనుల్లా గుర్బాజ్‌ అని పోస్ట్ చేస్తున్నారు. ఈ మ్యాచులో షహీన్ షా అఫ్రిది తన నాలుగు ఓవర్ల కోటాలో 29 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.



గాయంతో ఆసియా కప్‌ 2022కు షహీన్ షా అఫ్రిది దూరమయిన విషయం తెలిసిందే. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న అతడు టీ20 ప్రపంచకప్‌ 2022తో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. భారత్ బ్యాటర్లకి అఫ్రిదితో మెల్‌బోర్న్‌లో సవాల్ తప్పదని మాజీ క్రికెటర్లు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ప్రాక్టీస్ మ్యాచులలో రహమనుల్లా గుర్బాజ్‌ను ఆసుపత్రి పాలు చేయడంతో.. టీమిండియాకు డేంజర్ బెల్స్ మోగాయి. ఆస్ట్రేలియా‌లోని బౌన్సీ పిచ్‌లపై గంటకి సగటున 145కిమీ వేగంతో బంతులు వేసే అఫ్రిదిని ఎదుర్కోవడం ఏ బ్యాటర్‌కైనా సవాలే. భారత ఓపెనర్లు కూడా చాలా జాగ్రత్తగా ఆడాల్సిందే. 


Also Read: India vs Pakistan: అభిమానులకు షాక్.. భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ రద్దు!


Also Read: సూర్యగ్రహణం సమయంలో గ్రహాల కలయిక.. ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook