India vs Pakistan: అభిమానులకు షాక్.. భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ రద్దు!

Rain threat looms large on India vs Pakistan match in T20 World Cup 2022. క్రికెట్ ఫాన్స్ అందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న ఫాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 19, 2022, 01:28 PM IST
  • అక్టోబర్ 23న దాయాదుల సమరం
  • అభిమానులకు షాక్
  • భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ రద్దు
India vs Pakistan: అభిమానులకు షాక్.. భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ రద్దు!

Rain likely to play spoilsport India vs Pakistan match in T20 World Cup 2022: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన టీ20 ప్రపంచకప్ 2022 అక్టోబర్ 16న ఆరంభం అయింది. ప్రస్తుతం గ్రూప్ దశ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అసలు సమరం (సూపర్ 12 మ్యాచులు) అక్టోబర్ 22 నుంచి ప్రారంభం అవుతాయి. పొట్టి ప్రపంచకప్ తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. అక్టోబర్ 23న జరిగే హైఓల్టేజ్ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ మెగా మ్యాచ్ చూసేందుకు ఇండో-పాక్ క్రికెట్ అభిమానులకే కాకూండా.. క్రికెట్ ఫాన్స్ అందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే కోట్లాది మంది అభిమానులకు నిరాశ తప్పేలా లేదు.

ఆదివారం భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరిగే మెల్‌బోర్న్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అక్యూవెదర్ ప్రకటించింది. లానినా ప్రభావంతో మెల్‌బోర్న్‌ సిటీ మొత్తం భారీ నుంచి అతి భారీ వర్షం పడొచ్చని పేర్కొంది. అక్యూవెదర్ ప్రకారం.. రాబోయే రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం దాదాపుగా లేదు. బుధవారం వర్షం వచ్చే అవకాశం సున్నా శాతం ఉన్నప్పటికీ.. మెల్‌బోర్న్‌లో గురువారం (అక్టోబర్ 20) రాత్రి చిరు జల్లులు పడొచ్చట. గురువారం వర్షం పడే అవకాశాలు చాలా తక్కువ అని తెలిపింది. 

అక్టోబర్ 21, 22, 23 తేదీల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అక్యూవెదర్ చెప్పింది. అక్టోబర్ 21 (శుక్రవారం)న వర్షాలు కురిసే అవకాశం 96% ఉందట. అక్టోబర్ 22 (శనివారం) కూడా 95% అవకాశం ఉందని పేర్కొంది. ఇక అక్టోబర్ 23 (ఆదివారం) కూడా మెల్‌బోర్న్‌ నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని అక్యూవెదర్ అంచనా వేసింది. దాంతో అక్టోబర్ 22, 23 తేదీల్లో జరిగే ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్, భారత్ vs పాకిస్తాన్ మ్యాచులు జరగడం కష్టంగానే మారింది. ఈ రెండు మ్యాచులు దాదాపుగా రద్దు కానున్నాయట. 

టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12 దశలో జరిగే మ్యాచులకు రిజర్వ్ డేలు లేవు. సెమీ ఫైనల్స్, ఫైనల్స్‌కు మాత్రమే రిజర్వ్ డే ఉంది. సూపర్ 12 మ్యాచ్ కొనసాగాలంటే.. కనీసం అయిదు ఓవర్ల ఆట సాధ్యపడాలి. అయిదు ఓవర్లు కూడా వేయలేని పరిస్థితి ఉంటే.. మ్యాచ్‌ రద్దవుతుంది. విషయం తెలుసుకున్న ఫాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. భారత్ vs పాకిస్తాన్ మ్యాచుకు సంబందించిన టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. 

Also Read: సూర్యగ్రహణం సమయంలో గ్రహాల కలయిక.. ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే!

Also Read: Junaid Siddique Six: బాప్‌రే.. ప్రపంచకప్‌లోనే భారీ సిక్సర్‌! వైరల్ అయిన యూఏఈ ప్లేయర్ సెలెబ్రేషన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News