Ashish Nehra Picks India Squad for T20 World Cup 2022: ఆస్ట్రేలియా గడ్డపై జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022 టోర్న‌మెంట్‌కు సమయం దగ్గరపడుతోంది. అక్టోబర్ చివరలో ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఎక్కువగా టీ20లు ఆడుతున్నాయి. టీ20 ప్రపంచకప్‌కు సంబందించిన వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఇక మెగా టోర్నీ కోసం ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా జట్లు తమ టీంలను ప్రకటించాయి. భారత్ కూడా సెప్టెంబర్‌ 16న ప్రకటించే అవకాశం ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ20 ప్రపంచకప్‌ 2022లో పాల్గోనే భారత జట్టును మాజీలు ముందుగానే అంచనా వేస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ పేసర్‌ ఆశిష్ నెహ్రా తన జట్టును ప్రకటించాడు. ఓపెనర్‌లుగా రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌లను ఎంచుకున్నారు. టీ20 ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉందని, వచ్చే ఆరు గేమ్‌లలో రాహుల్ ప్రదర్శనను చూడాలన్నారు. ఇక మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా రాణించినా.. మూడో స్థానంలోనే బరిలోకి దిగాలని చెప్పారు. 


సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌.. నాలుగు, ఐదో స్థానాల్లో బ్యాటింగ్ చేస్తారని ఆశిష్ నెహ్రా పేరొన్నారు. అయితే మ్యాచ్ గమ్యాన్ని బట్టి ఈ ఇద్దరి బ్యాటింగ్ స్థానాలు మారొచ్చని చెప్పారు. ఫినిషర్ దినేష్‌ కార్తీక్‌, బ్యాటర్ దీపక్‌ హుడా.. ఆల్‌రౌండర్‌లు హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజాలకు నెహ్రా జట్టులో చోటు కల్పించారు. స్పెషలిస్టు స్సిన్నర్లగా యుజవేంద్ర చహల్‌, ఆర్ అశ్విన్‌ను ఎంపిక చేశారు. పేస్ కోటాలో జస్ప్రీత్‌ బుమ్రా, హర్షల్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, భువనేశ్వర్‌ కుమార్‌లకు అవకాశమిచ్చిన నెహ్రా.. సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ, స్వింగ్ మాస్టర్ దీపక్‌ చహర్‌లకు మొండిచేయి చూపాడు. 


ఆశిష్ నెహ్రా జట్టు ఇదే:
రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, దినేష్ కార్తీక్, దీపక్ హుడా, యుజ్వేంద్ర చహల్, ఆర్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్‌ సింగ్. 


Also Read: చిరంజీవి సినిమా కోసం.. నయనతార ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా?


Also Read: Suriya 42 Movie: 'సూర్య 42' మోషన్‌ పోస్టర్‌ ఔట్.. ఆసక్తి రేపుతున్న సూర్య నయా లుక్! 10 భాషల్లో విడుదల  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి