Nayanthara Remuneration: చిరంజీవి సినిమా కోసం.. నయనతార ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా?

Nayanthara shocking remuneration for Chiranjeevis Godfather Movie. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'గాడ్ ఫాదర్'  సినిమా కోసం నయనతార భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం తెలుస్తోంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 10, 2022, 02:59 PM IST
  • చిరంజీవి సినిమా కోసం
  • నయనతార రెమ్యునరేషన్ తెలుసా?
  • అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు గాడ్ ఫాదర్
Nayanthara Remuneration: చిరంజీవి సినిమా కోసం.. నయనతార ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా?

Nayanthara shocking remuneration for Chiranjeevis Godfather Movie: నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం, నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.   అంతకుముందు మలయాళంలో మూడు సినిమాలు చేసినా.. 2005లో వచ్చిన 'అయ్యా' సినిమాతో కోలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఆపై గజిని, చంద్రముఖి చిత్రాలతో అందరికి కంట పడ్డారు. తెలుగులో 'లక్ష్మి' సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. అగ్ర హీరోయిన్ అయ్యారు. బాస్, యోగి, దుబాయ్ శీను, తులసి, బిల్లా, అదుర్స్, శ్రీరామరాజ్యం, బాబు బంగారం సినిమాలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు. 

వరుస విజయాలతో దూసుకెళుతున్న నయనతారకు కెరీర్ పరంగా వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. అయితే నిజ జీవితంలో మాత్రం ఎదురుదెబ్బలు తగిలాయి. శింబు, ప్రభుదేవాలతో ప్రేమతో నయన్ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓ సమయంలో  డిప్రెషన్‌కు గురయ్యారు. ఇక సినీ కెరీర్ ముగిసిందనుకున్న తరుణంలో 'రాజా రాణి' సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఓ వైపు గ్లామర్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసి 'లేడీ సూపర్ స్టార్' అయ్యారు. 

ఇటీవల డైరెక్టర్ విఘ్నేశ్‌ శివన్‌ను పెళ్లిచేసుకున్న నయనతార.. రెండు పెద్ద స్టార్ల సినిమాలలో నటిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర హీరో షారుక్ ఖాన్ నటిస్తున్న 'జవాన్' సినిమాలో నయన్ కథానాయికగా చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'గాడ్ ఫాదర్' సినిమాలో కూడా నటించారు. మలయాళ సూపర్ హిట్ సినిమా 'లూసీఫర్' సినిమాకు రీమేగ్‌గా గాడ్ ఫాదర్ తెరకెక్కుతోంది. మోహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాజకీయ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

'గాడ్ ఫాదర్' సినిమాలో నయనతార.. మెగాస్టార్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం నయన్ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం తెలుస్తోంది. గాడ్ ఫాదర్ కోసం నయనతార ఏకంగా మూడు కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజముందో ఆ దేవుడికే తెలియాలి. ఇక ఈ సినిమాలో చిరంజీవి, నయనతార మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుల చేత కంటతడి పెట్టిస్తాయని టాక్. 

Also Read: రాహుల్‌ ద్రవిడ్‌ హనీమూన్‌ కాలం ముగిసింది.. భారత మాజీ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Also Read: Suriya 42 Movie: 'సూర్య 42' మోషన్‌ పోస్టర్‌ ఔట్.. ఆసక్తి రేపుతున్న సూర్య నయా లుక్! 10 భాషల్లో విడుదల  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News