T20 WC 2022: అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ 2022 షూరు కానుంది. ఈనేపథ్యంలో దక్షిణాఫ్రికా టీమ్‌ను ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. మొత్తం 15 మందిని టీమ్‌ను అధికారికంగా వెల్లడంచారు. టీమ్‌ కెప్టెన్‌గా టెంబా బావుమా ఎంపికయ్యాడు. గాయం కారణంగా ఆ దేశ స్టార్ ప్లేయర్ డసెన్ మెగా టోర్నీకి దూరమయ్యాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అతడి ప్లేస్‌లో హిట్టర్ ట్రిస్టన్ స్టబర్న్ ఎంపికయ్యాడు. క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, మార్‌క్రమ్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ వంటి ఆటగాళ్లతో దక్షిణాఫ్రికా టీమ్ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. ఇటు బౌలింగ్ విభాగంలో కీలక ప్లేయర్లను ఎంపిక చేశారు. రబడా, లుంగి ఎగిడి, కేశవ్ మహరాజ్, షంసీ నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. రిజర్వ్ ప్లేయర్‌గా మార్కో జెన్సెస్, జోర్న్ ఫోర్టెన్, పెక్యుల్వాయోను తీసుకున్నారు.


ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల తర్వాత టీ20 వరల్డ్ కప్‌ జట్టును ప్రకటించిన క్రికెట్‌ బోర్డుగా దక్షిణాఫ్రికా ఉంది. టీ20 వరల్డ్ కప్ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు జరగబోతోంది. సూపర్ 12 క్వాలిఫై అయిన జట్లలో సౌతాఫ్రికా ఉంది. గ్రూప్‌-2లో భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. మరోమారు టీ20 వరల్డ్ కప్‌లో
దయాది దేశాల మధ్య పోరు జరగనుంది.


దక్షిణాఫ్రికా జట్టు..


టెంబా బావుమా(కెప్టెన్), క్వింటన్ డికాక్(కీపర్), రీజా హెండ్రిక్స్, మార్‌క్రమ్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, రబడా, లుంగి ఎగిడి, కేశవ్ మహరాజ్, షంసీ, మార్కో జెన్సెస్, జోర్న్
ఫోర్టెన్, పెక్యుల్వాయో




Also read:Kottu Satyanarayana: ఏపీలోని ఆలయాల్లో ఇకపై డిజిటల్ దర్శనాలు: మంత్రి కొట్టు సత్యనారాయణ..!


Also read:Revanth Reddy: భారత్ జోడో యాత్రతో దేశ దశ దిశ మారుస్తామన్న రేవంత్‌రెడ్డి..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి