T20 World Cup 2022 Live Updates: అత్యాచారం కేసులో శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలక (Danushka Gunathilaka) నిన్న సిడ్నీలో అరెస్టయ్యాడు. ఈ ఉదయం శ్రీలంక జట్టు అతను లేకుండానే స్వదేశానికి వెళ్లిపోయింది. మూడు వారాల క్రితం గుణతిలక గాయపడగా, అతని స్థానంలో అషెన్ బండార జట్టులో చేరాడు. కానీ టీమ్ మేనేజ్‌మెంట్ గుణతిలకను ఇంటికి పంపకుండా జట్టుతోనే కొనసాగించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై దనుష్కను అరెస్టు చేసినట్లు శ్రీలంక క్రికెట్ వర్గాలు తెలిపాయి. డేటింగ్ యాప్ ద్వారా దనుష్క గుణతిలకకు పరిచయమైన 29 ఏళ్ల మహిళ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు చేసింది. ఈ వారం ప్రారంభంలో సిడ్నీలోని ఒక నివాసంలో ఈ సంఘటన జరిగింది. శ్రీలంక క్రికెటర్‌ను నిన్న రాత్రి టీమ్ హోటల్‌లో అరెస్టు చేశారు. సోమవారం అతడిని కోర్టులో హాజరుపరచనున్నారు. 


వరల్డ్ కప్ లో ముగిసిన లంక కథ
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా... నిన్న శ్రీలంక, ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఇంగ్లీష్ జట్టు విజయం సాధించడంతో శ్రీలంక ఇంటిదారి పట్టింది. ఇంగ్లాండ్ 4 వికెట్లు తేడాతో లంకపై గెలిచి సెమీస్ కు చేరింది. మెుదట బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసి విజయం సాధించింది. బెన్ స్టోక్స్ అద్భుతంగా ఆడి ఆ జట్టుకు గెలుపును కట్టబెట్టాడు. దీంతో లంక ఇంటిదారి పట్టింది. 

 


Also Read: Ind Vs Zim: జింబాబ్వేతో భారత్‌ పోరు నేడే.. తేలనున్న సెమీస్‌ బెర్తులు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి