T20 World Cup, India Vs zimbabwe: టీ20 ప్రపంచకప్ సూపర్-12 దశ చివరి మ్యాచ్‌లో ఇవాళ భారత జట్టు పసికూన జింబ్వేను ఢీకొనబోతోంది. ఈ మ్యాచ్ ఆదివారం నాడు మెల్‌బోర్న్ వేదికగా జరగనుంది. ఈ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1.30 నుంచి ప్రారంభం కానుంది.
ఆ ఇద్దరికీ ఛాన్స్ ఇస్తారా?
మూడు విజయాలు సాధించి గ్రూప్-2లో అగ్రస్థానంలో ఉంద టీమిండియా. అలాంటి భారత్ కు జింబాబ్వే ఏ మాత్రం నిలువరించగలుగుతుందో చూడాలి. జింబాబ్వే పాకిస్థాన్ లాంటి పెద్ద జట్టుకే షాకిచ్చింది. కాబట్టి రోహిత్ సేన ఆ జట్టును తేలిగ్గా తీసుకోకూడదు. మరోవైపు టీమిండియాను జట్టు కూర్పు ఇబ్బందిగా మారింది. గత మ్యాచ్ ద్వారా ఓపెనర్ రాహుల్ ఫామ్ లోకి రావడం ఊరటనిచ్చే అంశమే. ఆ ఫామ్ ను అలానే కొనసాగించాలని టీమ్ మేనెజ్ మెంట్ కోరుకుంటుంది. అయితే మరోవైపు కెప్టెన్ రోహిత్ నిలకడ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. అతడు భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఫామ్ భారత్ కు సానుకూలాంశం. హార్ధిక్ కూడా గాడిన పడాల్సిన అవసరం ఉంది. అవకాశాలు ఇస్తున్న దినేశ్ కార్తీక్ విఫలమవుతున్నాడు. మరి ఇతడి స్థానంలో పంత్ ను తీసుకొస్తారా లేదా కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి.
మరోవైపు బౌలింగ్ విషయంలో ఆశ్విన్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఆశ్విన్ ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమవుతున్నాడు, ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. మరి అశ్విన్ స్థానంలో చాహల్ ను తీసుకొస్తారా లేదా అతడినే కొనసాగిస్తారో చూడాలి. షమి, భువి, అర్షదీప్ పర్వాలేదనిపిస్తున్నారు.
రజాపైనే భారం
పేరుకే చిన్న జట్టు అయినా జింబాబ్వే...పాక్ లాంటి పెద్ద టీమ్ నే ఓడించింది. ఆ టీమ్ లో సికిందర్ రజా, సీన్ విలియమ్స్, ముజరబాని, ఎంగర్వ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు నిలకడగా రాణిస్తున్నారు. ముఖ్యంగా రజా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే నేరుగా సెమీపైనల్లో అడుగుపెడుతుంది. ఇప్పటికే గ్రూప్-1లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు సైమీస్ చేరాయి. ఇవాళ మనం గెలిస్తే సెమీస్ లో ఇంగ్లాండ్ ను ఢీకొనే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈరోజు నెదర్లాండ్స్‌తో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో పాకిస్థాన్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ల ఫలితాలను బట్టే గ్రూప్-2లో సెమీస్ బెర్తులు ఫిక్స్ అవుతాయి.
Also Read: India T20 World Cup: టీమిండియా సెమీస్‌లో తలపడే జట్టు ఇదే.. ఫైనల్‌కు చేరడం సులువేనా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి