T20 World Cup 2022 Host: టీ20 వరల్డ్ కప్ నిర్వహించనున్న (T20 World Cup 2022) వేదికలు ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఈ మెగాటోర్నీ మ్యాచ్లను ఏడు నగరాల్లో నిర్వహించనున్నారు. వీటిలో మెల్బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్, పెర్త్, అడిలైడ్, గీలాంగ్, హోబర్ట్ ఉన్నాయి (T20 worldcup venues). 45 మ్యాచ్లతో కూడిన ఈ మెగాటోర్నీ అక్టోబర్ 16 నుంచి నవంబరు 13 వరకు జరగనుంది (T20 World Cup Schedule). నవంబరు 9, 10 తేదీల్లో జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్లను సిడ్నీ, అడిలైడ్ వేదికగా జరగుతాయి. ఫైనల్ మ్యాచ్ ను మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో నిర్వహించనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మెగాటోర్నీ కోసం.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో మొదటి ఎనిమిది స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, టీమ్ఇండియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా జట్టు నేరుగా సూపర్ 12 దశలోకి అర్హత సాధించాయి. మిగిలిన నాలుగు స్థానాల కోసం క్వాలిఫైయింగ్ మ్యాచులు జరుగుతాయి. యూఏఈ వేదికగా ఇటీవలే నిర్వహించిన టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. 


Also Read: AUS Winning Celebration: 'షూలో బీర్' పోసుకొని తాగిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. వీడియో వైరల్


Also Read: T20 World Cup Prize Money: ఛాంపియన్ ఆస్ట్రేలియాకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook