T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ 2022 విన్నర్, రన్నర్ సహా ఇండియా, న్యూజిలాండ్ ప్లైజ్మనీ ఎంతంటే
T20 World Cup 2022: ఇంగ్లండ్ ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2022 ఛాంపియన్. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించి కప్ సొంతం చేసుకుంది ఇంగ్లండ్. విశ్వ విజేతగా నిలిచిన ఇంగ్లండ్‌కు ప్రైజ్‌మనీ రూపంలో ఎంత అందిందో తెలుసా..
నెలరోజులుగా జరుగుతున్న సమరం ముగిసింది. టీ20 పొట్టి ఫార్మట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ మరోసారి విజేతగా నిలిచింది. టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు..పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి కప్ చేజిక్కించుకుంది.
టీ20 ప్రపంచకప్ 2022 రసవత్తరంగా సాగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ సంచలనాలు నమోదయ్యాయి. నెదర్లాండ్స్, ఐర్లాండ్ వంటి క్రికెట్ పసికూనలు అగ్రజట్లపై విజయం సాధించి సంచలనం రేపాయి. ఇండియాపై విజయం సాధించిన ఇంగ్లండ్, న్యూజిలాండ్‌పై గెలిచిన పాకిస్తాన్‌లు ఫైనల్‌లో తలపడ్డాయి. మెల్‌బోర్న్ వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి..రెండవసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. 138 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలుండగా ఛేదించింది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రాన్ అద్భుతమైన స్పెల్‌తో పాకిస్తాన్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశాడు.
ఇక విశ్వ విజేతగా నిలిచినందుకు ఇంగ్లండ్‌కు దక్కిన ప్రైజ్‌మనీ, రన్నరప్ జట్టు పాకిస్తాన్ జట్టుకు లభించిన ప్రైజ్‌మనీ ఎంతో తెలుసుకుందాం. అదే సమయంలో సెమీ ఫైనల్స్‌లో పరాజయం పొందిన న్యూజిలాండ్, ఇండియాలకు లభించిన ప్రైజ్‌మనీ ఎంతనేది చూద్దాం.
ప్రైజ్‌మనీ ఎవరికి ఎంత
టీ20 ప్రపంచకప్ 2022 విజేత ఇంగ్లండ్‌కు ప్రైజ్‌మనీలో ఇండియన్ కరెన్సీ ప్రకారం 13 కోట్ల రూపాయలు లభించాయి. రన్నర్ పాకిస్తాన్ జట్టుకు 6.5 కోట్ల రూపాయలు దక్కాయి.
సెమీ ఫైనల్స్‌లో ఓడిన ఇండియా, న్యూజిలాండ్ జట్లకు 3.25 కోట్ల చొప్పున ప్రైజ్‌మనీ అందింది. ఇక సూపర్ 12 దశ నుంచే వైదొలగిన 8 జట్లకు 70 వేల డాలర్ల చొప్పున లభించింది.
Also read: T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో పాక్ కొంపముంచిన టర్నింగ్ పాయింట్, ఆ ఓవర్‌లో ఏం జరిగింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook