టీ20 ప్రపంచకప్ 2022 ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ పోరులో ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది. పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఇంగ్లండ్ ప్రపంచకప్ అందుకుంది. అయితే మ్యాచ్‌లో ఆ టర్నింగ్ పాయింటే పాకిస్తాన్ కొంప ముంచినట్టుగా తెలుస్తోంది.
అప్పటివరకూ మ్యాచ్ టైట్‌గా సాగింది. అంటే 16వ ఓవర్ వరకూ ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్తాన్ నువ్వా నేనా రీతిలో సాగింది. పాకిస్తాన్ అత్యల్ప స్కోరే చేసినా..బౌలర్లు ఓ దశలో ఇంగ్లండ్‌ను కట్టడి చేశారు. 16వ ఓవర్ వచ్చేసరికి ఇంగ్లండ్ 30 బంతుల్లో 41 బంతులు చేయాల్సిన పరిస్థితి. సరిగ్గా అప్పుడే 16వ ఓవర్ ప్రారంభించిన పాకిస్తాన్ స్టార్ బౌలర్ షహీన్ షా గాయం కారణంగా బయటకు వెళ్లిపోవడంతో..ఆ ఓవర్ మిగిలిన 5 బంతుల్ని మరో ఆటగాడు వేశాడు. అదే పాకిస్తాన్ కొంప ముంచేసింది.
పాకిస్తాన్ కొంప ముంచిన 16వ ఓవర్
షహీన్ షా అఫ్రిది గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లే సమయానికి ఇంకా 1.5 ఓవర్లు మిగిలున్నాయి. గాయం కారణంగా బౌలింగ్ వేయలేని పరిస్థితి. అప్పటికి ఇంగ్లండ్ 4.5 ఓవర్లలో 41 పరుగులు చేయాలి. ఆ సమయంలో కట్టుదిట్టంగా బౌల్ చేస్తున్న షహీన్ షా అఫ్రిది గాయపడకుండా స్పెల్ పూర్తి చేసుంటే..ఇంగ్లండ్‌కు కష్టమయ్యేది.
మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అదే
షహీన్ షా అఫ్రిది గాయపడటంతో ఆ తరువాత ఇఫ్తికార్ అహ్మద్, హారిస్ రవూఫ్, మొహమ్మద్ వసీమ్ జూనియర్లు కలిసి 3.5 ఓవర్లు వేసి..41 పరుగులు సమర్పించేశారు. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ స్టోక్స్ 49 బంతుల్లో 52 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అటు మొయిన్ అలీ సైతం 19 పరుగులు చేసి ఇంగ్లండ్ విజయానికి కారణమయ్యాడు. షహీన్ షా వదిలేసిన 5 బంతుల్ని ఇఫ్తికార్ అహ్మద్ పూర్తి చేశాడు. ఆ ఐదు బంతుల్లో స్టోక్స్ 1 ఫోర్, 1 సిక్సర్ కొట్టడంతో మ్యాచ్ ఇంగ్లండ్ వైపుకు మరలింది. కారణం ఒత్తిడి తగ్గడమే.
ఆ తరువాత మొహమ్మద్ వసీమ్ వేసి 17వ ఓవర్లో మొయిన్ అలీ మూడు ఫోర్లు కొట్టడంతో మొత్తంగా 16 పరుగులు లభించాయి. తరువాత హరీస్ రవూఫ్ వేసిన 18వ ఓవర్లో ఇంగ్లండ్ కేవలం 5 పరుగులే చేయగలిగింది. 19 వ ఓవర్ తొలి బంతికి మొయిన్ అలీ అవుట్ అయ్యాడు. ఆ తరువాత అదే ఓవర్లో స్టోక్స్ మిగిలిన పరుగుల్ని పూర్తి చేయగలిగాడు.
Also read: Englad Win World Cup: ఫైనల్లో పాక్ చిత్తు.. విశ్వవిజేతగా ఇంగ్లాండ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook