T20 World Cup IND vs PAK 'He can hit 12 off last 2 balls. India yet to find his replacement': Harbhajan wants star cricketer to play vs Pakistan: దుబాయ్ (Dubai) వేదికగా కాసేపట్లో స్టార్ట్ కానున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (IND vs PAK) మ్యాచ్ పైనే ఇప్పుడు అందరి దృష్టి. ఈ మ్యాచ్‌ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మ్యాచ్‌ కు సంబంధించి తమ టీంను ముందే ప్రకటించేసింది పాక్. కానీ టీమిండియా (Team India) మాత్రం జట్టును ప్రకటించకలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే తుది జట్టు ఎలా ఉంటే బాగుంటుందో సీనియర్ క్రికెటర్లు (Senior cricketers) సలహాలు ఇస్తున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా సీనియర్ క్రికెటర్లు చేస్తున్న సలహాలు టీమిండియా (Team India) వ్యూహరచనల్లో కీలక మార్పులకు కారణమవుతాయా అనే సందేహాలు పెంచుతున్నాయి. ఇందులో భాగంగానే హర్భజన్ సింగ్ పాకిస్తాన్ తో మ్యాచ్ లో ఆడేందుకు హార్దిక్ పాండ్యాను (Hardik Pandya) కచ్చితంగా తీసుకోవాలని చెప్పారు.


Also Read : T20 World Cup 2021 : బాబర్‌ నువ్వు అస్సలు భయపడకు ‌‌- షోయబ్‌ అక్తర్‌


తానే టీం మేనేజ్మెంట్‌లో భాగమై ఉంటే.. బ్యాటర్ గా హార్దిక్ పాండ్యాను కచ్చితంగా తీసుకునే వాడిని అని చెప్పారు. హార్దిక్ పాండ్యాకు ఆ సామర్థ్యం ఉందని చెప్పారు. చివరిగా 2లేదా 3 లేదా 4బంతులు ఎన్ని ఉన్నా 10 నుంచి 12పరుగులు తీసుకురాగల సత్తా హార్దిక్ పాండ్యాకు ఉందన్నారు. అతణ్ని జట్టులో ఉంచాలని కోరారు. బౌలింగ్ పరంగానూ.. జడేజా, బుమ్రా, షమీ, చక్రవర్తి లాంటి సాలిడ్ బౌలర్లతో జట్టు పటిష్ఠంగా ఉంటుంది అని చెప్పుకొచ్చారు హర్భజన్.


ఇక హార్దిక్ పాండ్యాను రీప్లేస్ చేయాలంటే మరొకరంటూ లేరని చెప్పుకొచ్చారు హర్భజన్ సింగ్ (Harbhajan Singh). ఎందుకంటే 6లేదా 7వ పొజిషన్ లో ఆడాలంటే అందరూ సెట్ కాలేరు. 3వ స్థానంలో ఆడే సూర్య కుమార్ యాదవ్ ను (Surya Kumar Yadav) 6 లేదా 7వ పొజిషన్ లో బ్యాటింగ్ చేయమంటే సడెన్ గా వచ్చిన మార్పును బ్యాలెన్స్ చేయలేకపోవచ్చని హర్భజన్ సింగ్ పేర్కొన్నారు. ఈ అవకాశం వచ్చిన 10కి 8సార్లు పాండ్యా (Hardik Pandya) నిలబెట్టుకున్నాడని హర్భజన్ గుర్తు చేశారు. చివరి రెండు బంతులు ఆడినా కనీసం ఒక్క సిక్స్ అయినా ఆడగలరని హర్భజన్ ధీమా వ్యక్తం చేశారు.


Also Read : T20 World Cup 2021 : హార్దిక్ పాండ్యా ఒంటి చేత్తో మ్యాచ్‌ గెలిపిస్తాడు - సెహ్వాగ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి