T20 World Cup 2021:  టీ20 ప్రపంచకప్‌2021లో భాగంగా..రేపటి నుంచి సూపర్‌ 12 రౌండ్‌ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో ఏ జట్టు టైటిల్‌ను గెలుస్తుందో అని క్రికెట్ నిపుణులు, మాజీలు అంచనాలు వేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఆసీస్‌ మాజీ స్పిన్నర్ షేన్‌ వార్న్‌ టైటిల్‌(T20 World Cup 2021) గెలుచుకోనే అర్హత ఇంగ్లాండ్, భారత్(India)లకు ఉందని అభిప్రాయపడ్డారు. ఆయన మాట్లాడుతూ... "టీ20 ప్రపంచకప్‌లో టైటిల్‌ బరిలో భారత్‌, ఇంగ్లండ్‌ నిలుస్తాయని నేను అనుకుంటున్నాను. న్యూజిలాండ్‌ కూడా ఐసీసీ ఈవెంట్‌లలో  ఆద్బతుంగా ఆడుతుంది. మరో వైపు ఆసీస్ జట్టు(Australia)లో చాలా మంది హిట్టర్లు ఉన్నందున వారిని తక్కువగా అంచనా వేయకూడదని నేను భావిస్తున్నాను. పాకిస్తాన్‌, భారత్‌ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని షేన్‌ వార్న్‌(Shane Warne) ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు.  


Also read:ఆస్ట్రేలియా బ్యాటర్ విధ్వంసం...ఒకే ఓవర్‌లో 8 సిక్సర్లు బాదేశాడు..!


టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆడిన రెండు వార్మప్‌ మ్యాచ్‌(Warm-up Matches)ల్లోనూ విజయం సాధించి టీమిండియా మంచి ఊపుమీద ఉంది. కాగా తొలి వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌  చేతిలో ఓటమి చెందిన ఇంగ్లండ్‌.. రెండో వార్మప్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించి తిరిగి ట్రాక్‌లో పడింది. అక్టోబర్ 24  కోహ్లి సేన దాయాది దేశం పాకిస్తాన్‌(Pakistan)తో  తలపడనుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook