Australian Batter 8 sixes in an Over: మనం సాధారణంగా ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు కొట్టడమే అరుదుగా చూస్తుంటాం. కానీ ఒకే ఒవర్‌లో 8 సిక్సర్‌లు బాది సామ్ హారిసన్(Sam Harrison) అనే ఆస్ట్రేలియా ఆటగాడు సరికొత్త రికార్డు సృష్టించాడు.
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా క్లబ్ క్రికెట్(Australia Club Cricket)లో భాగంగా.. సోర్రెంటో డంక్రైగ్ సీనియర్ క్లబ్, కింగ్‌స్లే వుడ్‌వాలే సీనియర్ క్లబ్(Kingsley-Woodvale Senior Club) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. డంక్రైగ్ క్లబ్ ఇన్నింగ్స్ 39 ఓవర్ వేసిన నాథన్ బెన్నెట్ బౌలింగ్‌లో సామ్ హారిసన్ ఏకంగా 8 బంతుల్లో 8 సిక్సర్‌లతో విద్వంసం సృష్టించాడు. ఈ ఓవర్‌లో రెండు నో బాల్స్ కూడా ఉన్నాయి. దీంతో ఆ ఓవర్‌లో ఏకంగా 50 పరుగులు అతడు సాధించాడు. ఈ మ్యాచ్‌లో హారిసన్ 11 సిక్సర్లు, 6 ఫోర్లతో 102 పరుగులు చేయడం విశేషం.
Also read: T20 World Cup 2021: IND Vs PAK మ్యాచ్‌ల్లో అతి పెద్ద కాంట్రావర్శీలు, ఎప్పటికీ గుర్తుండే హైలైట్స్
ఇక మ్యాచ్ విషయానికి వస్తే... మొదట బ్యాటింగ్ చేసిన సోరెంటో డంక్రైగ్(Sorrento Duncraig Senior Club) 40 ఓవర్లలో 276 పరుగులు సాధించింది. అనంతరం 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్‌స్లే వుడ్‌వాలే నీర్ణీత 40 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులకే పరిమితమైంది. దీంతో డంక్రైగ్ క్లబ్ 122 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఈ మ్యాచ్‌కు సంబంధించిన స్కోర్ కార్డు సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి