India Vs New Zealand: భారత్ టాప్ ఆర్డర్‌ను కలవరపెడుతున్న ఆ ఇద్దరు న్యూజిలాండ్ బౌలర్లు
భారత్ Vs న్యూజిలాండ్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. భారత్ కు ఇది కీలక మ్యాచ్.. భారత్ ఈ మ్యాచ్‌లో ఓడిపోతే సెమీస్ చేరే అవకాశం పూర్తిగా కోల్పోయినట్లే.. అయితే టీమిండియా బ్యాట్స్ మెన్ లను న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ & ఇష్ సోధి లతో తిప్పలు తప్పవు అంటున్నారు మాజీ క్రికెటర్లు...
T20 World cup India Vs New Zealand: టీ20 ప్రపంచకప్‌లో (ICC T20 World Cup 2021) మరో కీలక మ్యాచ్‌కు టీమిండియా సిద్ధం అయింది. దుబాయి వేదికగా ఆదివారం మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుతో రెండో మ్యాచ్‌లో తలపడనుంది. గత ఆదివారం తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ (Pakistan) చేతిలో ఘోర ప్రరజయాన్ని మూటకట్టుకున్న భారత జట్టు.. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమై పరాజయాన్ని చవిచూసింది. ఒకవేళ న్యూజిలాండ్ (New Zeland) తో జరిగే మ్యాచ్‌లోనూ ఓడితే.. సెమీస్ చేరుకునే అవకాశాలు దాదాపుగా కోల్పోయినట్లే..!!
అయితే ఈ కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ (Trent Boult) నుండి టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ లకు ఇబ్బందులు తప్పవని అంచనా మాజీలు వేస్తున్నారు. అయితే పాకిస్తాన్ గెలుపులో కీలక పాత్ర పోస్తిస్తున్న షాహిన్ అఫ్రిది (Shaheen Afridi) తరహాలో బౌలింగ్ చేస్తానని.. టీమిండియాను కట్టడి చేస్తానని న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఇది వరకే ప్రకటించాడు.
Also Read: Whats App Cash Back: వాట్సాప్ పేమెంట్స్‌లో రూ. 255 ఖచ్చితమైన క్యాష్‌బ్యాక్.. త్వరపడండి!
అయితే బౌలర్ ట్రెంట్ బౌల్ట్ నుండే కాదు న్యూజిలాండ్ స్పిన్నర్ ఇష్ సోధి (Spinner Ish Sodhi) నుండి కూడా టీమిండియా బ్యాట్స్ మెన్ లకు ప్రమాదం ఉంది. ఇది వరకు మ్యాచ్‌లు పరిశీలిస్తే స్పిన్నర్ ఇష్ సోధి భారత్ పై మంచి పట్టు ఉంది. T20 మ్యాచ్‌లలో ఇప్పటి వరకు కోహ్లీని (Virat Kohli) 5 సార్లు సోధి ఔట్ చేయటం.. భారత్ అభిమానులను నిరాశ కలిగిస్తుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోతే.. సెమిస్ చేరే అవకాశాలు దాదాపు అసాధ్యమే..
ఇప్పటి వరకు టీమిండియాతో 12 మ్యాచ్‌లు ఆడిన సోది 17 వికెట్లు పడగొట్టి మంచి రికార్డ్ నమోదు చేసాడు. అంతేకాకుండా ఈ సంవత్సరంలో 8 మ్యాచ్‌లు ఆడిన ఇష్ సోధి (Ish Sodhi) 18 వికెట్లు తీసి మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈ ఇద్దరి బౌలర్లను టీమిండియా బ్యాట్స్ మెన్ ఎలా ఎదుర్కొంటారో.. వేచి చూడాల్సిందే.
Also Read: Niloufer Hospital Hyderabad: హైదరాద్ లో దారుణం.. 100 రూపాయల కోసం బాలుడి ప్రాణం తీసిన వార్డ్ బాయ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook