Team India T20 World Cup Prize Money: కోట్లాది మంది అభిమానుల కల నెలవేరింది. టీ20 వరల్డ్ కప్‌ను టీమిండియా సొంతం చేసుకోవడంతో సంబరాలు అంబరాన్ని అంటాయి. గతేడాది వన్డే వరల్డ్ కప్‌ ఫైనల్‌లో ఓటమికి రెట్టింపు ఆనందాన్ని ఇచ్చేలా రోహిత్ సేన పొట్టి కప్‌ను ముద్దాడింది. ఐసీసీ ట్రోఫీ కోసం 11 సంవత్సరాల ఎదురుచూపులకు చెక్ పడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 169/8కి పరిమితమైంది. బ్యాటింగ్‌లో కోహ్లీ, అక్షర్ పటేల్.. బౌలింగ్‌లో హార్థిక్ పాండ్యా, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ మెరుపులు మెరిపించి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. డీఏ ఏకంగా 16 శాతం పెంపు..!


టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి 2.45 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.20.42 కోట్ల ప్రైజ్‌ మనీ అందుకుంది. కప్ కోసం ఆఖరి వరకు అద్భుతంగా పోరాడి.. రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా $1.28 మిలియన్లు అంటే సుమారు రూ.10.67 కోట్లు ప్రైజ్‌ మనీ సొంతం చేసుకుంది. టోర్నీ ఆసాంతం ఆకట్టుకుని సెమీస్‌కు చేరుకున్న అఫ్గానిస్థాన్‌తోపాటు ఇంగ్లాండ్ జట్లకు $787,500 అంటే రూ.6.56 కోట్లు దక్కింది. సూపర్-8లో నిలిచిన జట్లకు రూ.3.17 కోట్ల చొప్పున ప్రైజ్‌మనీ దక్కింది. 9 నుంచి 12వ ర్యాంకు టీమ్ కు రూ.2.5 కోట్లు, 13 నుంచి 20వ ర్యాంకు జట్లకు రూ.1.87 కోట్లు ఐసీసీ అందించింది. ఇక గెలిచిన మ్యాచ్‌కు రూ.26 లక్షలు అదనంగా అందజేసింది.


మ్యాచ్‌ విషయానికి వస్తే.. చేజారిపోయిందనుకున్న మ్యాచ్‌ను హార్థిక్ పాండ్యా టీమిండియా వైపు తిప్పాడు. 24 బంతుల్లో 26 పరుగులు మాత్రమే చేయాల్సిన సమయంలో అద్భుతంగా పుంజుకుంది. హెన్రిచ్ క్లాసెన్ (27 బంతుల్లో 52) దూకుడుతో మ్యాచ్‌ సౌతాఫ్రికా చేతిలోకి వెళ్లిపోయింది. క్లాసెన్‌ను పాండ్యా ఔట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ తరువాత ఓవర్‌లో బుమ్రా కేవలం రెండు పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. 19వ ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ కేవలం నాలుగు పరుగులే ఇవ్వడంతో చివరిలో ఓవర్‌లో 16 పరుగులు అవసరం అయ్యాయి. హార్థిక్ వేసిన ఈ ఓవర్‌లో తొలి బంతికే మిల్లర్ భారీ షాట్ కొట్టగా.. అందరూ సిక్సర్ పోయిందనుకున్నారు. కానీ బౌండరీ లైన్‌ వద్ద సూర్య కుమార్ యాదవ్ కళ్లు చెదిరే రీతో క్యాచ్ అందుకున్నాడు. దీంతో టీమిండియా విజయం ఖాయమైపోయింది. 


Also Read: Babar Azam Love Story: జూనియర్ అనుష్క శర్మతో బాబర్ ఆజం డేటింగ్.. అచ్చం కోహ్లీ భార్యలా ఉందే.. పిక్స్ చూశారా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter