Team India Still Have Semifinal Chances: దుబాయ్ లో జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్ (T20 World Cup) లో మొదట పాకిస్తాన్.. (Pakistan) రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ (New Zealand) తో ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. అయితే నిన్న బుధవారం అప్గానిస్థాన్​తో (Afganistan) జరిగిన మ్యాచ్​లో ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అఫ్గాన్​తో జరిగిన మ్యాచ్​లో అద్భుత ప్రదర్శన చేసింది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచిన అప్గాన్​ను ఎదుర్కోవడం అంత సులువైన పని కాదు.. అయినప్పటికీ  టీమ్ ఇండియా సమష్టి కృషితో విజయం సాధించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే తాజాగా ఆఫ్ఘన్ పై గెలుపుతో టీమిండియా (Team India) సెమీస్ కు చేరే అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయని తెలుస్తుంది. నిన్న జరిగిన ఆఫ్ఘన్ మ్యాచ్‌లో కోహ్లీ సేన భారీ తేడాతో గెలవటం కారణంగా సెమీస్ ఆశలు ఇంకా మిగిలి ఉన్నాయనే చెప్పవచ్చు. టోర్నీలో ఉండాలన్నా, సెమీస్ ఆశలు నిలుపుకోవాలన్నా.. భారీ రన్ రేట్ వ్యత్యాసంతో గెలవాల్సిన మ్యాచ్ లో భారత ఆటగాళ్లు ఉత్తమ ప్రదర్శన కనబరచి.. గెలిచారు. 


Also Read: Bus Fall into Ravine: పండుగ రోజు విషాదం.. లోయలో పడిపోయిన బస్సు.. 22 మంది మృతి


పాకిస్తాన్,  న్యూజిలాండ్‌ తో జరిగిన మ్యాచ్‌ల మాదిరిగానే ఈ సారి అప్గానిస్థాన్ కూడా టాస్ ఒడిన భారత్.. మొదట బ్యాటింగ్ చేసి.. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 210 భారీ స్కోర్ చేసింది. అయితే సమిష్టి కృషితో ఈ మ్యాచ్‌లో గెలిచిన భారత్ పాయింట్ల పట్టికలో స్థానాన్ని మెరుగుపరచుకొని.. నాలుగో స్థానంలో నిలిచింది. దీంతో ఇపుడందరి దృష్టి భారత్ సెమీస్ చేరుతుందా అనే అంశంపై చర్చిస్తున్నారు. 


[[{"fid":"214769","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


నిజానికి కోహ్లీ సేన (Kohli Team) సెమీస్ చేరే అవకాశాలు ఉన్నప్పటికీ.. అది అంత తేలికేం కాదని చెప్పొచ్చు లేదా సులభంగా కూడా సెమీస్ చేరొచ్చు. ఎందుకంటే ఇది పొట్టి ప్రపంచ కప్.. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. అయితే న్యూజిలాండ్‌  టీమ్ ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే ఇందులో ఏ ఒక్కటి ఓడిపోయినా... టీమిండియాకు సెమీస్ చేరే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా.. టీమిండియా ఆడబోయే తదుపరి మ్యాచ్‌లు నమీబియా (Namibia), స్కాట్లాండ్ (Scotland) లలో మంచి రన్ రేట్ తో విజయం సాధిస్తే.. భారత్ కు సెమీస్ చేరే అవకాశం ఉంది 


Also Read: Diwali Vastu Tips: దీపాలను దక్షిణంవైపు తిప్పకండి..లక్ష్మీపూజ సాయంత్రం 6.32గం-8.21గం చేయాలి


నమీబియా, స్కాట్లాండ్ లతో భారీ వ్యత్యాసంతో టీమిండియా గెలిచే అవకాశాలున్న.. న్యూజిలాండ్‌  అదే రెండు జట్లతో గెలవాలంటే... కొంచెం కష్టం అనే చెప్పవచ్చు. అయితే ఇపుడు భారత అభిమానుల దృష్టి అంతా.. న్యూజిలాండ్‌ - అప్గానిస్థాన్​ మ్యాచ్‌ పైనే ఉంది.. భారత్ సెమీస్ చేరాలంటే అప్గానిస్థాన్ ఈ మ్యాచ్ గెలవాలి.. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌  ఓడిపోవాలని.. టీమిండియా సెమీస్ చేరాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.. ఏం జరుగుతుందో వేచి చూడాలి మారీ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook